జనసేన: బిజెపి మొండిచెయ్యి.. కారణం..?

Divya
ఈ రోజున కేంద్ర క్యాబినెట్ విస్తరణలో భాగంగా జనసేనకు బిజెపి పార్టీ మొండిచేయి చూపించినట్లు కనిపిస్తోంది.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం మీద ఐదుగురికి స్థానం కల్పించింది. బిజెపి ఏపీ నుంచి ఇద్దరు టిడిపి ఒక బిజెపి ఎంపీ కి అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీకి బిజెపి ఒక్క సారిగా షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఇటీవలే బిజెపి ,టిడిపి, జనసేన పార్టీకి హైప్ రావడానికి ముఖ్య కారణం జనసేన పార్టీ అయినప్పటికీ కూడా ఈ పార్టీకి సంబంధించి ఎంపీల విషయంలో ఎవరిని కూడా తీసుకోకపోవడంతో అభిమానులు తెగ ఫీలైపోతున్నారు.

జనసేన ఎంపీ బాలశౌర్యకి మోడీ క్యాబినెట్ల అవకాశం ఇస్తారని వార్తలు ఎక్కువగా వినిపించాయి. టిడిపి బిజెపి మధ్య పొత్తు కుదురుంచడంలో తనే కీలకంగా మారానట్టు పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ కి కచ్చితంగా అన్నిచోట్ల ప్రధమ అవకాశం ఉంటుందని అనుకున్నారు జనసేన నేతలు కార్యకర్తలు కానీ ఈ నేపథ్యంలోనే జనసేనకు అవకాశం ఇవ్వకపోవడంతో పార్టీ శ్రేణులకు కాస్త నిరాశ కలుగుతోంది. మరో రకంగా జనసేన కు అవకాశం కల్పిస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతానికి జనసేన ను మాత్రం కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోలేదని తెలుస్తోంది .ఒక కమ్మ ,క్షత్రియ, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఏపీ నుంచి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాపులను ప్రస్తుతానికి పక్కన పెట్టడంతో ఇప్పుడు రాజకీయాలలో ఈ విషయం మరొకసారి హాట్ టాపిక్ గా  తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ బిజెపి అగ్రనేతలతో ఎలాంటివి చర్చించాలో తెలియదు కానీ కేంద్ర కేబినట్లో చోటు ఇవ్వకపోవడం కేవలం పవన్ కళ్యాణ్ కి చెప్పే చేశారని ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఈ విషయం పైన అటు టిడిపి జనసేన పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: