మోడీ 3.0: కొత్త మంత్రులు వీరే..!

Divya
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ అందుకున్నారు.ఇక ఈరోజు కేంద్ర కేబినెట్ కూడా ఖరారు అయింది .ఆదివారం ఉదయం నరేంద్ర మోడీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు.. ముఖ్యంగా ప్రధాని కార్యాలయం నుంచి ఈ ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. రాష్ట్రపతి భవన్ లో ఈరోజు రాత్రి 715 గంటలకు నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. మూడుసార్లు ప్రధానిగా చేసిన జోహార్ లాల్ నెహ్రూ రికార్డును ఇప్పుడు సమం చేయనున్నారు నరేంద్ర మోడీ.. బిజెపి కి 240 సీట్లు మాత్రమే రాగా.. మిత్రపక్షలతో కలిపి ఎన్డిఏ 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సంకీర్ణ సర్కార్ కేబినెట్లో భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా భాగం కానున్నారు..

ఇకపోతే కేబినెట్లో బిజెపి నుంచి నితిన్ గట్కరి,  రాజ్నాథ్ సింగ్ , పీయూష్ గోయల్ , జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహన్ ,ప్రహ్లాద జోషి, అనురాగ్ ఠాకూర్, మన్సుక్ మాండవియా , రావు ఇంద్రజిత్తు సింగ్ ,అశ్విని వైష్ణవ్, కిరణ్ రిజిజు లకు చోటు లభించింది..  ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఏడుగురికి కేబినెట్లో స్థానం లభించింది ..తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి , బండి సంజయ్ లకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ రాగా ఇప్పుడు వీరిద్దరూ కేంద్ర మంత్రివర్గంలోకి చోటు దక్కించుకున్నట్లు సమాచారం.  ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ కు కేబినెట్ బెర్త్ దక్కింది.. అలాగే రామ్మోహన్ నాయుడు టిడిపి,  పెమ్మసాని చంద్రశేఖర్ జెడిఎస్, కుమారస్వామి, జెడియు లలన సింగ్, సహాయ మంత్రిగా జెడియు రామ్నాథ్ ఠాకూర్ , జితిన్ రామ్ మాంజి , జయంత్ చౌదరి వంటివారికి  చోటు లభించింది..  మోడీతో పాటూ మొత్తం 50 మంది కొత్త మంత్రులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.
సి ఆర్ పాటిల్, రాజేంద్ర సింగ్ షెకావత్, శ్రీపాద నాయక్, గిరిరాజ్ సింగ్, మురళీధర్ మొహల్, కృష్ణ పాల్ గుర్జర్, చంద్రశేఖర్ పెమ్మసాని, రామ్ మోహన్ నాయుడు కింజరాపు, సావిత్రి ఠాగూర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, అజయ్ తమ్తా, అనుప్రియా పటేల్, హర్ష్ మల్హోత్రా, నిత్యానంద రాయ్, మనోహర్ లాల్ కట్టర్, జితిన్ ప్రసాద్, అన్నపూర్ణాదేవి, సర్భానంద సోనో వాల్, రవ్ నీత్ సింగ్ బిట్టు, శోభ కరంధ్లాజే, శివరాజ్ సింగ్ చౌహన్, బి ఎల్ వర్మ, హరదీప్ సింగ్ పూరి, జి కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, బండి సంజయ్, మన్సుక్ మాండవియా, శాంతను ఠాకూర్, రావ్ ఇంద్రజిత్ సింగ్, కిరణ్ రిజిజు, జితేంద్ర సింగ్, రాందాస్ అథవాలే, ప్రతాప్ రావు జాదవ్, రక్షా ఖడ్సే, అర్జున్ రామ్ మేఘవాల్, జ్యోతిరాదిత్య సింధియా, హెచ్డి కుమారస్వామి, చిరాగ్ పాశ్వాన్, రామ్నాథ్ ఠాకూర్, జితం రామ్ మాంగి, జయంత్ చౌదరి, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, ఎస్ జై శంకర్, నితిన్ గట్కరి, రాజు నాథ్ సింగ్, అమిత్ షా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: