భారీ విజయం సరే.. చంద్రబాబు ఆ ఒక్కటి గుర్తు పెట్టుకుంటే పాలన సూపర్ హిట్టే?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేతులు మారింది. చేతులు మారడం అంటే అలా ఇలా కాదు.. ఏకంగా 2019లో అఖండ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో మాత్రం కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. ఒకప్పుడు ఓటమితో ప్రతిపక్షం తోనే  సరిపెట్టుకున్న టిడిపికి అఖండ విజయంతో అధికారం వచ్చేసింది. అయితే ఇక టిడిపి కూటమి విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 అంతెందుకు 2019లో అధికారాన్ని కోల్పోయినప్పుడు బాధపడిపోయిన చంద్రబాబు సైతం.. ఈ భారీ విజయంతో తెగ సంతోష పడిపోతున్నారు. అయితే ఇక ఆంధ్ర ప్రజలు ఇలా భారీ విజయం అందించారని సంతోషపడితే సరిపోదు అఖండ విజయాన్ని అందించిన ఆంధ్ర ప్రజల నమ్మకాన్ని కూడా చంద్రబాబు నిరబెట్టాల్సి ఉంటుంది. అయితే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు దీటుగానే చంద్రబాబు కూడా మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే ఈ ఒక్క మేనిఫెస్టోను చూసి మాత్రమే ఆంధ్ర ప్రజలు గెలిపించారు అని చంద్రబాబు అనుకుంటే మాత్రం చివరికి పొరపాటు పడ్డట్టే.

 ఎందుకంటే కేవలం సంక్షేమం చూసి మాత్రమే ఓట్లు వేయాలనుకుంటే ఇప్పటికే సంక్షేమం అందించిన జగన్ వైపే ప్రజలను నిలిచేవారు. కానీ అభివృద్ధి కూడా కావాలనుకున్నారు కాబట్టే చంద్రబాబును సీఎం చేశారు. అందుకే ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే.. ఇంకోవైపు సంపదని సృష్టించాలి. మరోవైపు రాష్ట్రంలోని ప్రాంతాలన్నింటినీ కూడా ఎలాంటి వివక్ష లేకుండా అభివృద్ధి చేయాలి. ఆగిపోయిన ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలి. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి. రాజధాని అమరావతిని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చాలి. ఇవన్నీ చేస్తేనే చంద్రబాబు పాలన సూపర్ హిట్ అయినట్టు. ఇది గుర్తుపెట్టుకోకుండా చంద్రబాబు జగన్ లాగే సంక్షేమమే గెలిపిస్తుందని పథకాలని నమ్ముకుంటే మాత్రం ఇక వచ్చే ఎన్నికల్లో కూటమికి బుద్ధి చెప్పేందుకు కూడా రెడీగానే ఉంటారు అన్నది మొన్నటి రిజల్ట్ తోనే అందరికీ అర్థమయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: