పార్లమెంట్ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన బర్రెలక్క.. రాజకీయాలకు బై.. బై..!

Divya
గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు విడుదల చేయలేదని సోషల్ మీడియా ద్వారా నానా హంగామా చేశారు. అలా మంచి పాపులారిటీ సంపాదించుకుంది బర్రెలక్క అలియాస్ శిరీష.. ఈమె గురించి చెప్పాల్సిన పనిలేదు.. రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టి ఒక సంచనలంగా మారింది. ముఖ్యంగా హాయ్ ఫ్రెండ్స్ నేను బర్రెలు కాసుకుంటున్నాను  ఉద్యోగ నోటిఫికేషన్ వేయకపోవడంతో ఈ పని చేస్తున్నానంటూ వీడియో ద్వారా సంచలనంగా మారింది శిరీష.. ఆ తర్వాత పాపులారిటీ పెరగడంతో ఈమె రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఎంట్రీ ఇచ్చినప్పుడు బాగానే ఉన్నా.. ఆ తర్వాత గెలవలేకపోయింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసింది.. అంతేకాకుండా జోరుగా కూడా ఆమె ప్రచారం చేసినప్పటికీ ఆ ప్రచారానికి ఎంతో మంది నిరుద్యోగ యువత కూడా శిరీషకు సపోర్టుగా చేశారు. కానీ ఆమె మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.. కేవలం 5000 ఓట్లు మాత్రమే ఈమె సంపాదించుకోగలిగింది. దీంతో బర్రె లెక్క ఇక రాజకీయాలకు దూరంగా ఉండి వివాహం చేసుకుంటుంది అనే వార్తలు వినిపించాయి. వివాహం చేసుకొని ప్రస్తుతం లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నప్పటికీ.. రాజకీయాలను వదిలేయనని తెలిపింది.

అన్నట్టుగాని ఎవరూ ఊహించని విధంగా ఆమె పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచింది తన భర్తతో కలిసి వివిధ స్థాయిలో తీవ్రమైన ప్రచారం చేసినప్పటికీ ఈ ఎన్నికలలో బర్రెలు అక్కకు ఊహించని విధంగా షాక్ తగిలింది.. అదేమిటంటే అసెంబ్లీ ఎన్నికలలో కంటే చాలా ఘోరంగా ఓట్లు ఈమెకు వచ్చాయట కేవలం 3 వేలకు పైగా ఓట్లు మాత్రమే రావడంతో పెద్ద ఎత్తున బర్రె లక్క పైనా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. దీంతో ఈ ఓటమితో షేర్సా ఖచ్చితంగా రాజకీయాలనుంచి దూరంగా అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఏ మేరకు శిరీష ఈ విషయం పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: