మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పొందిన ఐశ్వర్య మీనన్.. ఎవరో తెలుసా..?

Divya
ఇటీవలె సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మరొకసారి విజయాన్ని అందుకుంది.. దీంతో ప్రధాన మోడీ ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో మూడవసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మోడీ ప్రమాణ కార్యక్రమానికి సుమారుగా 8,000 మంది అతిథులు కూడా హాజరయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నదట. వీరులు పౌర దేశాల నుంచి చాలామంది అధినేతలతో పాటు.. వందే భారత్ లోకో పైలట్ ఐశ్వర్య ఎస్ మీనన్కు అధికారులు ఆహ్వానాన్ని పంపించినట్లు తెరుస్తోంది. దీంతో ఎవరా ఐశ్వర్య ఎస్ మీనన్ అనే విషయం ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది.

ఐశ్వర్య ఎస్ మీనన్ ఎవరో కాదు దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ అన్నట్లుగా తెలుస్తోంది.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో జన శతాబ్ది వంటి వివిధ రైళ్లలో కూడా ఈమె లోకో పైలట్ గా చేసింది. రెండు లక్షలకు పైగా ఫుడ్ ప్లేట్ గంటలను పూర్తి చేసిందట ఇమే.. చెన్నై, విజయవాడ, కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులలో మీనన్ మీనన్ పనిచేసింది . ముఖ్యంగా ఈమె చురుకుదనంతో రైల్వే సిగ్నల్ లింక్ పైన కూడా సమగ్ర పరిజ్ఞానంతో నాణ్యమైన సేవలు అందించిన సీనియర్ అధికారుల నుంచి ఈమె ప్రశంసలు సైతం ఎక్కువగా అందుకున్నదట.

ప్రధాన మోడీ ప్రమాణ స్వీకారానికి దాదాపుగా పదిమంది లోకో పైలట్లకు సైతం ఆహ్వానం అందినట్లుగా సమాచారం. అందులో ఐశ్వర్య మీనన్ పేరు కూడా ఉండడంతో పాటు ఆసియాలోనే  తొలి మహిళ లోకో పైలట్ సురేఖ యాదవ్ కూడా ఇందులో పేరు సంపాదించారు. ఈమె 1988లో భారత దేశంలో మొదటి లోకో పైలట్ గా ఒక చరిత్రను సృష్టించింది అదేవిధంగా సెంట్రల్ వీస్టాప్ ప్రాజెక్టులో పని చేస్తున్న కార్మికులు కేంద్ర ప్రభుత్వం పథకాల లబ్ధిదారులు, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానాలు పంపించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: