విజయంతో కూడిన సవాళ్లు : మహిళలకు ఫ్రీ బస్ ఓకే.. ఆ డ్రైవర్లకు బాబు దారి చూపుతారా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని చాలామంది భావించగా ఆ నమ్మకమే నిజమైంది. అయితే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో అమలైన విధంగా ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ అమలు కానుందనే సంగతి తెలిసిందే. అయితే ఏపీ ఫ్రీ బస్ స్కీమ్ అమలైతే ఆటో డ్రైవర్లు భారీ స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది. పట్టణాల్లో లోకల్ గా తిరిగే ఆటో డ్రైవర్లపై పెద్దగా ప్రభావం పడకపోయినా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిప్పే ఆటో డ్రైవర్లు నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుంది.
 
అయితే ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగేలా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు. ఆటో డ్రైవర్లకు బాబు ఏదైనా దారి చూపుతారా అనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. ఆటో డ్రైవర్లు సైతం కూటమి సర్కార్ తమకు మేలు చేసేలా కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
 
విజయంతో కూడిన సవాళ్లను బాబు ఏ విధంగా అధిగమిస్తారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. మరోవైపు మహిళలకు ఫ్రీ బస్ విషయంలో నియమ నిబంధనలు ఎలా ఉంటాయో చూడాలి. ఫ్రీ బస్ వల్ల బస్సులపై రద్దీ భారం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే జాబ్ చేసే మహిళలు మాత్రం ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
 
ఫ్రీ బస్ అమలుకు సంబంధించి కొన్ని నిబంధనలు అమలు చేస్తే బాగుంటుందని మరి కొందరు భావిస్తున్నారు. ఫ్రీ బస్ స్కీమ్ ను అమలు చేయకుండా ఛార్జీలను సగానికి సగం తగ్గిస్తే బాగుంటుందని కొంతమంది మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు ఏ హామీలపై సంతకాలు పెడతారో చూడాల్సి ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: