రాయలసీమ: ఆ నియోజకవర్గం ఫలితం ఒక సంచలనం..!

Divya
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక సంచలనాత్మకంగా మారాయి.. రాజకీయ పండితుల అంచనాలు కుల సమీకరణాలు ప్రభుత్వ వ్యతిరేకత ఇలాంటి అంచనాలు అన్నీ కూడా చెల్లాచెదురుగా మారిపోయాయి.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 164 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో రెండు దశాబ్దాలలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని నియోజవర్గాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సెంటిమెంట్లు చరిత్రలు కంచుకోట వంటి వాటిని కూడా చల్లా చెదురు చేసింది టిడిపి. ఇలాంటి వాటిలో సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గ ఫలితం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి  గురిచేస్తోంది.

ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ దాదాపుగా 3వేల ఓట్ల మెజారిటీతో అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి అయిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పైన గెలిచారు. కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి 20 సంవత్సరాల నుంచి ధర్మారంలో పనిచేస్తూ ఉన్నారు. 2005లో కాంగ్రెస్ ఇంచార్జిగా ఎంట్రీ ఇచ్చిన ఈయన 2009 ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు.. ఆ తర్వాత 2014లో ఓడిపోయారు. 2019లో మళ్లీ గెలిచారు ఇప్పుడు మళ్లీ ఓడిపోయారు. ఎన్నికలకు నెల ముందు నియోజకవర్గంలో అడుగుపెట్టి అక్కడ గెలిచిన సత్య కుమార్ ఒక సంచలనంగా మారారు.

ముఖ్యంగా సత్య కుమార్ కూడా ఎవరో ధర్మవరం ప్రజలకి అసలు తెలియదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడని విషయం పైన ఎవరికీ తెలియదు.. అసలు ఆయన కులం పేరును కూడా ఊరికే పెట్టుకున్నారని యాదవ్ కాదని అభిప్రాయాలు కూడా ఎక్కువగా వినిపించాయి. అంతేకాకుండా కేతిరెడ్డి గత ఐదేళ్లలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ పలు రకాలు నియోజకవర్గం తిరిగి ప్రతి ఇంటిని కూడా పలకరించారు. కరోనా రెండేళ్లను మినహాయిస్తే మూడు సంవత్సరాల కేతిరెడ్డి నియోజకవర్గంలో డోర్ టు డోర్ తమ సమస్యలను విని చాలా వాటిని పరిష్కరించారు. ఇలా ఎన్నో చేసినప్పటికీ నాయకుడు చివరికి ఈసారి ఎక్కువ పేరు లేనటువంటి నాయకుడు చేతిలో ఓడిపోవడంతో రాయలసీమలో ఈ సీటు పైన మరొక సారి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: