జాతీయ మీడియాలో రామోజీ పాత్ర‌.. ఏం చేశారు... ఎందుకు ఫెయిల‌య్యారు...?

RAMAKRISHNA S.S.
- ఈనాడు స‌క్సెస్ అయ్యాక జాతీయ మీడియాలోకి రామోజీ ఎంట్రీ
- న్యూస్ టైం పేరుతో ఆంగ్ల దిన‌ప‌త్రిక ప్రారంభం
- ఈనాడు ఎదుగుద‌ల‌పై ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని ఆపేసిన వైనం
- వ‌చ్చే యేడాది నుంచి పునః ప్రారంభించాల‌న్న సంక‌ల్పం
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
తెలుగులో ఈనాడును స్థాపించి.. తెలుగు ప్ర‌జ‌ల‌కు చేరువైన రామోజీరావు... జాతీయ మీడియాపై కూడా.. ఒకానొక ద‌శ‌లో దృష్టి పెట్టారు. 1980-90ల‌మ‌ధ్య ఆయ‌న న్యూస్ టైం పేరుతో ఆంగ్ల దిన‌ప‌త్రిక‌ను తీసుకు వ‌చ్చారు. ముంబై కేంద్రంగా దీనిని ఏర్పాటు చేశారు. రెండేళ్ల‌పాటు.. దేశ‌వ్యాప్తంగా దీనిని ప్రింటు చేశారు. అప్ప‌టి రాజ‌కీయ ప‌రిణామాలు. రాష్ట్రాల ప‌నితీరును కూడా భేరీజు వేసుకున్నారు. ఈ ప‌త్రిక‌.. చాలా రోజులు .. ఇండియా టుడే, హిందూ వంటి ప్ర‌ముఖ ప‌త్రిక‌ల‌కు పోటీ కూడా ఇచ్చింది.

అయితే... న్యూస్ టైంను మ‌రింత విస్త‌రించాల‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చినా.. దానివ‌ల్ల ఈనాడుపై ప్ర‌భావం ప‌డుతుంద‌న్న కొన్ని సూచ‌న‌లు కూడా వ‌చ్చాయి. దీంతో వాటిపై అధ్య‌య‌నం చేయించిన రామోజీ.. క్ర‌మ క్ర‌మంగా వెన‌క్కి త‌గ్గారు. 2000 సంవ‌త్స‌రం నాటికి దానిని పూర్తిగా ఆపివేశారు. అలా రామోజీ ఇంగ్లీష్ దిన ప‌త్రిక అనుకున్న స్థాయిలో అయితే స‌క్సెస్ కాలేక పోయింది. అయితే.. ఈ ప‌త్రిక పేరును మాత్రం త‌మ ద‌గ్గ‌రే ఉంచుకున్నారు. ఇప్ప‌టికీ.. ఆన్లైన్‌లో ఈ పేరు ప‌త్రిక రెండూ క‌నిపిస్తాయి. వ‌చ్చే సంవ‌త్స‌రం నుంచి తిరిగి ప్రారంభించాల‌ని అనుకున్నారు.

న్యూస్ టైం అయిన‌.. ఈనాడైనా..రామోజీ పాటించిన పాత్రికేయ విలువ‌లు ఒక్క‌టే. కానీ, జాతీయ స్థాయికి వ‌చ్చే స‌రికి భిన్న‌మైన ప్ర‌జ‌ల‌ను సంతృప్తిప‌రిచే సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌డం.. రాష్ట్రాల్లో వివిధ పార్టీల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌డంతో న్యూస్ టైంను అలా మ‌లిచే ప్ర‌య‌త్నంలో కొంత మేర‌కు వెనుక బ‌డ్డారు.పైగా నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొర‌త కూడా.. వెంబ‌డించింది. దీంతో ఆ ప‌త్రిక అలా నిలిచిపోయింది. అయితే.. ఎప్ప‌టికైనా ఎద‌గాల‌ని అనుకున్నా.. సాధ్యం కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: