మోడీకి వ్యతిరేకంగా లోకేష్ కామెంట్స్.. NDAలో ఉండి ఇలా అన్నాడేంటి?

praveen
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి పార్టీలు ఎంత ఘనవిజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా 175 స్థానాలను 164 స్థానాలు గెలుచుకుని అఖండ విజయాన్ని అందుకున్నాయి. ఇక మరికొన్ని రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతుండగా.. అటు ఈ కూటమిలో ఉన్న జనసేన బిజెపి పార్టీలకు ఎలాంటి బాధ్యతలు దక్కబోతున్నాయి అన్నది హాట్ టాపిక్ మారింది.

 అదే సమయంలో అటు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా టిడిపి సత్తా చాటిన నేపథ్యంలో.. కేంద్రంలో అటు చంద్రబాబు నాయుడు కీలక రోల్ పోషించే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. ఏకంగా ప్రభుత్వంలో చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు అని చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అటు బిజెపి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇటీవల టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనగా మారిపోయాయి. తాము మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అటు బీజేపీ ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ ప్రకటన ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఇలా ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్టి, ఎస్టీ బీసీలకు అందిస్తాము అంటూ అటు ప్రధాన నరేంద్ర మోడీ చెప్పారు. అయితే ఇటీవల లోకేష్ మాత్రం ఇందుకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం బుజ్జగింపు కాదు అంటూ వ్యాఖ్యానించారు. అది కేవలం సామాజిక న్యాయం మాత్రమే అవుతుంది అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అన్నారు మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్. 20 ఏళ్లుగా కొనసాగుతున్న రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నాము అంటూ లోకేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలోవ్యాఖ్యలు చేశాడు. దీంతో ఎన్డీఏ కూటమిలో ఉండి ప్రధాని మోదీ వ్యాఖ్యలకు లోకేష్ ఇలా వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడేంటి అని అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: