రాజీ పడని నిత్య శ్రామికుడు ‘రామోజీ’!

Suma Kallamadi
ఎడతెగని అంకితభావానికి, పని పట్ల తిరుగులేని నిబద్ధతకు పర్యాయపదంగా పేరు తెచ్చుకున్నారు రామోజీ రావు. నేడు ఈ మీడియా మొగల్ తుది శ్వాస విడిచారు. ఆయన తరతరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వాన్ని మిగిల్చారు. ఈనాడు గ్రూప్ ఛైర్మన్‌గా, భారతీయ మీడియా రంగంలో మహోన్నత వ్యక్తిగా ఆయన ఎదిగారు. 88 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఈ నిత్య శ్రామికుడికి ఈరోజు భారతదేశం వ్యాప్తంగా కోట్ల మంది నివాళులు అర్పిస్తున్నారు. అలానే తీవ్ర శ్లోకంలో మునిగిపోయారు. సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఒక చిన్న గ్రామంలో జన్మించిన రామోజీరావు మీడియా మొగల్‌గా మారడం వెనుక ఆయన నిరంతర కృషి ఉంది. తెలివి, పట్టుదల, కృషితో ఆయన ఈనాడు వార్తాపత్రికను తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ న్యూస్ పేపర్ గా నిలబెట్టగలిగారు. ఈ పేపర్ విశ్వసనీయతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. దేశవ్యాప్తంగా విభిన్న ప్రేక్షకులకు సేవలందించే టెలివిజన్ ఛానెల్‌ల సంస్థ అయిన etv నెట్‌వర్క్‌ను కూడా ఆయన స్థాపించారు. ఈ ఛానెల్స్ నెంబర్ వన్‌గా నిలపడంలో ఆయన చాలా కృషి చేశారు. ప్రింట్ మీడియాలోనే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ప్రాణించడం వెనక ఆయన కష్టం ఎంతో ఉంది.
మీడియా పరిశ్రమకు రావు చేసిన కృషి కేవలం వార్తలకే పరిమితం కాలేదు. అతను రామోజీ ఫిల్మ్ సిటీని కూడా స్థాపించాడు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీ, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రనిర్మాతలకు కేంద్రంగా మారింది. 1983లో ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన రామోజీరావు మొత్తంగా 80కి పైగా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, వాటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలే కావడం విశేషం. కొన్ని కన్నడ, హిందీ, ఇతర భాషా చిత్రాలను కూడా నిర్మించారు. ప్రతిఘటన, చిత్రం, నువ్వే కావాలి, నచ్చావులే, నువ్విలా వంటి హిట్ సినిమాలతో నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు రామోజీరావు.
మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ వ్యాపారాన్ని కూడా స్టార్ట్ చేశారు. అలానే మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఓ చిన్న ఆఫీసులో కేవలం ఇద్దరు వ్యక్తులతో ప్రారంభించారు. దీని ద్వారా చిట్టీలు కట్టే ఆసక్తిని తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కలిగించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కూడా ఈ పండు సంస్థను విస్తరించారు. ప్రజలకు డబ్బు అవసరాలను తీర్చడానికి, హఠాత్తుగా అవసరమయ్యే ఖర్చులను భరించడానికి ఈ సంత అండగా నిలిచింది.డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కూడా స్థాపించే విషయమైనా సేవలు అందించారు. ఈ సంస్థల్లో ప్రతి ఒక్కటి సక్సెస్ కావడానికి ఆయన అలుపు ఎరగకుండా కష్టపడ్డారు. అన్నింటా అఖండ విజయం సాధించినప్పటికీ, చివరి శ్వాస ఉన్నప్పుడు ఏదో చేయాలని తప్పని పడ్డారు. పని, వ్యక్తిగత విలువల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: