రామోజీ రావు: రామోజీ మరణం పై మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..!

Divya
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఈ రోజున ఉదయం మరణించారు . రామోజీరావు వయసు కూడా 88 సంవత్సరాలు..ఈయన మరణ వార్త తో ఒక్క సారిగా సినీ ఇండస్ట్రీ, రామోజీ గ్రూప్ సంస్థలు, పలువురు నేతలు తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతున్నారు. ఇప్పుడు తాజాగా ప్రధాన నరేంద్ర మోడీ కూడా రామోజీరావు మరణానికి సంతాపం ప్రకటించారు. సినీ రంగం పైన రామోజీరావు చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కూడా కలిగించిందని ట్విట్ చేయడం జరిగింది. అలాగే రామోజీరావు తో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు రావడం గురించి కూడా తెలియజేశారు.

మీడియాలో రామోజీ సరికొత్త ప్రయాణాలను సైతం నెలకొల్పారని రామోజీరావు ఎప్పుడు దేశ అభివృద్ధి కోసమే ఆలోచించేవారు అన్నట్లుగా మోడీ తెలియజేశారు. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి అంటూ వెల్లడించారు. అందుకు సంబంధించిన ట్విట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. రామోజీరావు అస్తమయం పైన బీజేపీ అగ్రనేత రాజు నాథ్ సింగ్ కూడా సంతాపాన్ని తెలియజేశారు.. మీడియా చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావు మృతి సినీ రంగానికి తీరని లోటు అంటూ తెలియజేశారు. అలాగే తన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి అంటూ రాజ్నాథ్ సింగ్ ట్విట్ చేశారు

సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న రామోజీరావు గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం స్టాంట్లు కూడా వేయించుకున్నట్లు సమాచారం .ఈరోజు ఉదయం అస్వస్థకు గురి కావడంతో వెంటనే దగ్గర లో ఉండే స్టార్ హాస్పిటల్ కి చేర్పించారు. కానీ ఉదయం నాలుగు గంటల సమయంలో రామోజీరావు మరణించినట్లుగా వైద్యులకు తెలియజేశారు. రామోజీరావుకు ఎంతోమంది అధినేతలతో రాజకీయ నేతలతో కూడా మంచి అనుబంధం కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: