రామోజీరావు: జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ఎందుకు.. ఎలా హీరోను చేశారంటే...!

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ రోజు టాలీవుడ్‌లో నే తిరుగులేని నెంబ‌ర్ వ‌న్ హీరోగా ఉన్నారు. అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎప్పుడో 2001లో నిన్ను చూడాల‌ని సినిమాతో హీరోగా టాలీవుడ్ తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. అంత‌కు ముందు బాల‌న‌టుడిగా కొన్ని సినిమాలు చేసినా కూడా నిన్ను చూడాల‌ని సినిమాతోనే ఎన్టీఆర్ హీరో అయ్యారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ర‌వీనా రాజ్ పుత్ హీరోయిన్‌గా పరిచ‌యం అయ్యింది. ఈ సినిమా ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్‌పై చెరుకూరి రామోజీరావు నిర్మించారు. నాగార్జున‌తో నువ్వు వ‌స్తావ‌ని లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమా తీసిన వంకినేని ర‌త్న‌ప్ర‌తాప్ ( వీఆర్ ప్ర‌తాప్ ) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా అడుగు పెట్టిన ఎన్టీఆర్ ఇక అక్క‌డ నుంచి వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. ఈ రోజు టాలీవుడ్‌లోనే తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. రామోజీరావు జూనియ‌ర్ ఎన్టీఆర్ ను హీరోను చేయ‌డం వెన‌క ఓ ఆస‌క్తి క‌ర స్టోరీ ఉంది. వాస్త‌వానికి ఎన్టీఆర్‌ను హీరోగా చేస్తాన‌ని రామోజీరావు సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఎప్పుడో మాట ఇచ్చారు. అయితే అదే టైంలో వైజ‌యంతీ మూవీస్ అధినేత చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ కూడా ఎన్టీఆర్‌ను సీనియ‌ర్ ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమ‌తో తానే హీరోగా లాంచ్ చేస్తాన‌ని చెప్పారు.

హ‌రికృష్ణ‌కు త‌న తండ్రి సీనియ‌ర్ ఎన్టీఆర్‌... రామోజీరావుకు ఇచ్చిన మాట గుర్తుకు వ‌చ్చింది. దీంతో హ‌రికృష్ణ త‌న కుమారుడిని హీరోను చేసే అవ‌కాశం రామోజీకే ఇచ్చారు. అలా తొలి సినిమాగా నిన్ను చూడాల‌ని వ‌చ్చింది. అయితే రెండో అవ‌కాశం అశ్వ‌నీద‌త్‌కే ద‌క్కింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ - అశ్వ‌నీద‌త్ కాంబినేష‌న్లో స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై స్టూడెంట్ నెంబ‌ర్ 1 సినిమా వ‌చ్చింది. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్‌. ఈ సినిమాతోనే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: