రామోజీరావు : ఈనాడు జ‌ర్న‌లిజం స్కూల్ ... తెలుగు జ‌ర్న‌లిజానికి దిక్సూచి ..!

praveen
ఈటీవీ సంస్థల, అధినేత ఈనాడు ఛానల్ సృష్టికర్త, దిగ్గజ వ్యాపారవేత, ప్రముఖ నిర్మాత అయిన మూవీ మొగల్ రామోజీరావు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గత కొంత కాలం  నుంచి ఆయన తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు  కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద పేగు క్యాన్సర్ తో పోరాడుతూ విజయవంతంగా కోలుకున్నారు దిగ్గజం రామోజీరావు. అయితే  మహమ్మారి క్యాన్సర్ నుంచి కోలుకున్నప్పటికీ ఇంకా క్యాన్సర్ వ్యాధి నమూనాలు మాత్రం ఆయనను ఇంకా బాధ పెడుతూనే వచ్చాయి.

 ఇక ఇటీవల అధిక రక్తపోటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా  లో ఉన్న స్టార్ హాస్పిటల్ లో చేర్చారు. అయితే వైద్యులు రామోజీరావు గుండెకు స్టంట్ అమర్చి ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచారు. దురదృష్టవశాత్తు ఆయన ఇటీవల తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు  ఈ క్రమంలోనే దిగజం రామోజీరావు మృతితో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతోమంది ప్రముఖులు రామోజీరావు మృతి పై స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు భాష అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

 అయితే రామోజీరావు స్థాపించిన ఈనాడు అనే పత్రిక జర్నలిజం అనే పదానికి కేరాఫ్ ఫొటోస్ గా ఉండేది. అయితే పాత్రికేయ వృత్తిలోకి రావాలి అనుకునే ఎంతో మంది యువకులకు ఆయన ఈనాడు జర్నలిజం అనే స్కూల్ ని స్థాపించి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించడమే కాదు శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ట్రైనీలుగా తమ వద్దనే పని చేయించుకుని జీతం కూడా ఇచ్చేవారు. ఆ తర్వాత వారి ప్రతిభకు తగ్గట్లుగా మంచి స్థాయిని కల్పించి ఎంతోమంది ప్రాత్రికేయులను ప్రోత్సహించారు. ఇలా ఈనాడు జర్నలిజం స్కూల్ స్థాపించాలి అని రామోజీరావు చేసిన గొప్ప ఆలోచన తెలుగు జర్నలిజనికే దిక్సూచిగా నిలిచింది  నేటితరంలో ఎంతోమంది జర్నలిస్టులు.. ఈనాడు జర్నలిజం స్కూల్లో శిక్షణ పొంది బయటికి వచ్చిన వారే కావడం గమనార్హం. ఒక దిగువ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రతి రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: