రామెజీరావు కెరీర్ హైలెట్స్‌... హెరాల్డ్ ఎక్స్‌క్లూజివ్

RAMAKRISHNA S.S.
ఈనాడు సంస్థ‌ల అధినేత చెరుకూరి రామోజీరావు అస్త‌మ‌యం చెందారు. గ‌త కొంత కాలంగా హృద‌య సంబంధిత స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న నిన్న మ‌ధ్యాహ్నం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అంత‌కు ముందు ఆయ‌న‌కు గుండె ఆప‌రేష‌న్లు చేసిన వైద్యులు స్టంట్‌లు అమ‌ర్చారు. ఇక నిన్న మధ్యాహ్నం ప‌రిస్థితి విష‌మించ‌డంతో పాటు ఆయ‌న్ను వెంట‌నే నాన‌క్ రామ్ గూడ‌లోని స్టార్ హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు.

గ‌త రాత్రి చికిత్స పొందుతూ రామోజీ తెల్ల‌వారు ఝామున 4.50 నిమిషాల‌కు మృతిచెందారు. ఆయ‌న మృతిప‌ట్ల తెలుగు సినీ, రాజ‌కీయ ఇత‌ర రంగాల‌కు చెందిన ఎంద‌రో ప్ర‌ముఖులు సంతాపాల వెల్లువ కొన‌సాగిస్తున్నారు. రామోజీ కెరీర్ హైలెట్స్ చూద్దాం.

- 1936 న‌వంబ‌ర్ 16 కృష్ణా జిల్లా పెద‌పారుపూడిలో ఆయ‌న జ‌న్మించారు.
- రామోజీ తల్లి వెంక‌ట‌సుబ్బ‌మ్మ‌, తండ్రి వెంక‌ట సుబ్బారావు
- 1961 లో తాతానేని రమాదేవితో వివాహం
- 1962 లో మార్గ‌ద‌ర్శి ఏర్పాటు
- రామోజీకి ఇద్ద‌రు కుమారులు సుమ‌న్‌, కిర‌ణ్‌
- రామోజీ అస‌లు పేరు చెరుకూరి రామ‌య్య‌
- ఆయ‌న ముందుగా ప‌చ్చ‌ళ్ల వ్యాపారంలోకి అడుగు పెట్టారు
- 1967 ఖ‌మ్మంలో ఎరువుల వ్యాపారం

- 1970 ఇమేజెస్ అవుట్‌డోర్ ఆధ్వ‌ర్యంలో యాడ్స్ ఏజెన్సీ ప్రారంభం
- గుడివాడ‌లో ప్రాథ‌మిక విద్య పూర్తి చేసిన ఆయ‌న బీఎస్సీ పూర్తి చేశారు.
- 1974లో ఈనాడు విశాఖ‌ప‌ట్నం ఎడిష‌న్‌ ప్రారంభం
- 1975 హైద‌రాబాద్ ఎడిష‌న్ ప్రారంభం
- 1976లో సినీ ప్రేమికుల కోసం సితార ప్రారంభం
- 1978లో చ‌తుర‌, విపుల‌

- 1980లో ప్రియా ఫుడ్స్ ప్రారంభం
- 1988లో ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్ ప్రారంభం
- ఉషా కిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్‌పై మొత్తం 87 సినిమాలు తీసిన నిర్మాత‌.. ప్ర‌తిఘ‌ట‌న‌, మౌన‌పోరాటంతో పాటు ఆయ‌న బ్యాన‌ర్ ద్వారా ప‌రిచ‌యం అయిన ఎంద‌రో న‌టీన‌టులు ద‌ర్శ‌కులు త‌మ‌దైన ప్ర‌తిభ క‌న‌ప‌రిచారు.
- 1990లో ఈనాడు జ‌ర్న‌లిజం స్కూల్ ఏర్పాటు
- 1996 లో రామోజీ ఫిల్మ్‌సిటీ
- 2002లో ఈనాడు - ఈటీవీ ఆధ్వ‌ర్యంలో ఆరు ప్రాంతీయ ఛానెల్స్‌
- 2016 లో ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గాను ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: