కడపలో కూడా వైసీపీకి రివర్స్..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఈసారి ఎన్నికలు చాలా టఫ్ గా ఉంటాయని అందరూ అనుకున్నారు.. కానీ ఓటింగ్ పర్సంటేజ్ చూసిన తర్వాత వారు వన్ సైడ్ అయిందని వార్తలు వినిపించాయి. కానీ అది ఎవరి పక్కా అనేది ఫలితాలలో తేలిపోయింది. ముఖ్యంగా వైసిపి టిడిపి పార్టీల మధ్య పోరా హోరిగా ఎన్నికలు జరిగాయి. ఏది ఏమైనా ఈసారి ఎన్నికలలో టిడిపి పార్టీ 164 సీట్లలో కూటమిలో భాగంగా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో వైసిపి నేతలకు కార్యకర్తలకు కూడా చాలా ఇబ్బందులను గురిచేస్తుంది టిడిపి పార్టి.

అయితే ఇప్పుడు తాజాగా వైయస్ ఫ్యామిలీకి కంచుకోట ఆయన కడపలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కడప జిల్లాలో వైయస్సార్ పార్టీకి ఒక సమస్య వచ్చి పడింది. జిల్లా పరిషత్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అది వైయస్ కుటుంబం అడ్డా అనుకుంటే ఈసారి టిడిపి పార్టీ కైవసం అయింది. ఏడు స్థానాలు టీడీపీ పార్టీని కైవసం చేసుకుంది. ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి చాలా కీలకమైనటువంటి పరిస్థితి. రాజంపేటలో ఎమ్మెల్యే గెలిచినటువంటి ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి.. రాజీనామా చేశారు జిల్లా పరిషత్ చైర్మన్గా.

ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి.. మళ్లీ వైసీపీ పార్టీ జిల్లా పరిషత్ ని గెలుచుకోగలరా.. ఇవాళ ఉన్న పరిస్థితులలో తీవ్ర వ్యతిరేకత గొడవలు గందరగోలాల మధ్యన పరిస్థితి ఏంటన్నది చూడాల్సి ఉన్నది.. అంతేకాకుండా ఇప్పటికే చాలా ప్రాంతాలలో కూడా టిడిపి నేతలు సైతం వైసీపీ నేతల ఇళ్ల పైన దాడులు చేస్తూ కార్యకర్తలను చంపుతామంటూ బెదిరిస్తూ ఉండడమే కాకుండా వారి ఇంటికి వెళ్లి మరి నాన్న హంగామా చేస్తున్నారు. ఈ విషయం పైన ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి సహితం గవర్నర్కు లేఖ కూడా రాయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ ఆగడాలు మరింత ఎక్కువ అవుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: