కొడాలి నాని తర్వాత వంశీని టార్గెట్ చేస్తూ రాళ్ల దాడి .. అరేయ్ వంశీ అంటూ?

Reddy P Rajasekhar
వైసీపీ నేత వల్లభనేని వంశీ ఈ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలకు ముందే వంశీ ఓటమిపాలవుతారని వార్తలు వినిపించగా ఆ వార్తలే ఎట్టకేలకు నిజమయ్యాయి. అయితే వల్లభనేని వంశీకి టీడీపీ కార్యకర్తలు చుక్కలు చూపిస్తున్నారు. వంశీ నివాసం దగ్గర టీడీపీ శ్రేణులు హల్చల్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అరేయ్ వంశీ అంటూ అరుస్తూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
 
వంశీ ఇంటిపై రాళ్ల దాడి చేయడంతో పాటు గేట్లు విరగ్గొట్టే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. వంశీ ఇంట్లోకి చొచ్చుకొని పోవడానికి కూడా కొంతమంది ప్రయత్నించగా పోలీసుల ఎంట్రీతో సమస్య సాల్వ్ అయిందని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల ఇళ్లపై జరుగుతున్న దాడుల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా ఘటనలు ఏపీ పరువు తీస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
మరోవైపు రాష్ట్రంలో ఘర్షణల వాతావరణం గురించి చంద్రబాబు స్పందిస్తూ వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ క్యాడర్ సైలెంట్ గా ఉండాలని కోరారు. దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు సూచనలు చేశారు. పోలీసులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు.
 
చంద్రబాబు నాయుడు పిలుపుతో అయినా రాష్ట్రంలో ఈ పరిస్థితి మారుతుందేమో చూడాల్సి ఉంది. వల్లభనేని వంశీ ఈ ఘటనల గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఉద్రిక్త ఘటనలు వైసీపీ నేతలను టెన్షన్ పెడుతున్నాయి. ప్రమాణ స్వీకారం కూడా జరగకుండానే రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం రాష్ట్రానికి మంచిది కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
రాష్ట్రం అభివృద్ధి కోరుకుని ఓటర్లు ఓట్లు వేశారే తప్ప హింస సృష్టిస్తారని కాదని నెటిజన్లు చెబుతున్నారు. ఏపీలో ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే ఆ ప్రభావం రాష్ట్ర అభివృద్ధిపై పడుతుంది. కొడాలి ఇంటిపై గుడ్ల దాడి ఘటన మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: