ఆంధ్రాలో వైసీపీని పట్టించుకునే వారే లేరా..?

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే టీడీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది.. ఆంధ్రప్రదేశ్లో మూడు నెలలలో పెనుమార్పులు సంభవించబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక కేడర్ లను లీడ్ చేసేవారు ఎవరూ లేరు.. చాలా చోట్ల తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించి వారు ఉత్సాహంగా ఉంటే.. ఇప్పుడు వైసీపీ పార్టీ డల్ అవ్వడంతో వారితో మాట్లాడేవారు కరువయ్యారు.. నాయకులకు కూడా ఎక్కడ ఉండాల అనే విషయం పైన ఆలోచిస్తూ ఎవరు సేఫ్టీ వారు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కార్యకర్తలను అసలు పట్టించుకునే వాళ్లే లేరు.. నాయకుడని కూడా పట్టించుకునే వారు లేరు. అప్పుడు ఎక్కడికి పోవాలి మీరందరూ.. అయితే అప్పుడు ఆయా పార్టీలవైపు వెళ్లడం మాత్రమే వీరికి ఉన్న మరొక ఆప్షన్.. లేదంటే వేరే ప్రాంతాలకు వెళ్లడం.. ఇది ఆల్రెడీ ప్రారంభమైంది కూడ అయితే కచ్చితంగా ఎవరు అధికారంలోకి వస్తారా ఆపోజిట్ పార్టీ నేతలు కార్యకర్తలు నాయకులు సైతం కచ్చితంగా వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది.. ఇప్పుడు ఆల్రెడీ పల్నాడు లో కూడా జరుగుతుంది.. రాయలసీమలో కూడా ఇలాంటిదే జరుగుతోంది.

ఉత్తరాంధ్రలో కూడా ఇదివరకు ఉండేది కాదు ఇప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడింది.. కోస్తా జిల్లాలో కూడా ఇప్పుడు ఆ దపా కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో జరగబోయే మూడు నెలల్లో పెను అంశం. గతంలో వైసిపి వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు టిడిపి వాళ్ళు హైదరాబాదులో ఉన్నారు.. ఇప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్లు హైదరాబాద్ కి వెళ్ళిపోతున్నారు. ఇది ఒకరకంగా తెలంగాణకు బిజినెస్ వంటిదని కూడా చెప్పవచ్చు. మరో విషయానికి వస్తే మున్సిపాలిటీలు , కార్పొరేషన్లు, మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు పంచాయితీలు ఇవన్నీ కూడా ఇప్పటిదాకా హైయెస్ట్ గా వైసీపీ పార్టీకే ఉన్నాయి.

పంచాయితీలు 81 శాతం.. మున్సిపాలిటీలు కార్పొరేషన్లు 90% దాకా.. జిల్లా పరిషత్తులు అయితే అన్నీ ఉన్నవి. కార్పొరేషన్లు కూడా అన్ని.. అయితే ఇప్పుడు అవన్నీ కూడా టిడిపి పార్టీ పక్కకు మారిపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే మధ్యలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. మరి ఒకపక్క పార్టీని మెయిన్టైన్ చేస్తూ ఇలాంటి వారందరిని వైసిపి పార్టీ మెయింటైన్ చేయడం కాస్త ఆలస్యంగా మారుతుంది ముఖ్యంగా ఓటమిని జీర్ణించుకోలేక పోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP

సంబంధిత వార్తలు: