ఏపీ: వైసిపి నేత పిన్నెల్లికి హైకోర్టు ఊరట..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సమయంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈవీఎంలను పగలగొట్టి హాట్ టాపిక్ గా మారారు.దీంతో ఈ వైసీపీ నేతపైన ఎన్నో కేసులు సైతం బుక్ అయ్యాయి. అయితే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేవరకు తనని అరెస్టు చేయకూడదంటూ నివేదికలు కూడా అందించింది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ తొలగిస్తూ ఆదేశాలను కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది.

అలాగే ఈవీఎం ధ్వంసం మరో మూడు కేసులు పిన్నెల్లి పైన పల్నాడు స్టేషన్లో నమోదు అయ్యాయట.ఈ కేసుల్లో గతంలో మద్యం తర  ముందస్తు బెయిల్ పొందారు. అయితే ఇప్పుడు న్యాయస్థానం మరింత పొడిగించినట్లు తెలుస్తోంది. వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిలు ను పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. వచ్చే గురువారం వరకు మధ్యంతర భైలును పొడిగించాలని పిన్నెల్లి న్యాయవాది సైతం కోరడంతో ఇదంతా కేవలం కుట్రపూరితంగానే తన మీద కేసులు పెట్టారని కూడా పిన్నెల్లి న్యాయవాది తెలియజేశారు.

ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్ ఉన్న కేసుల్లో 41 A నోటీసు ఇవ్వచ్చని సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులను తెలియజేసింది. ఎన్నికల సంఘం ఈవీఎం ధ్వంసం కేసులో విచారణ చేయాలని అలా కాకుండా నేరుగా అరెస్టు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఇది చట్ట విరుద్ధం అంటూ కూడా ఆయనకు కోర్టుకు వెల్లడించారు.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ప్రతిష్ట దెబ్బ తినడానికి ఇతర నేతలు సైతం కుట్ర పడి ఇలా చేశారని అంతేకాకుండా అత్యాయత్నం కేసులో కూడా తనని అనవసరంగా ఇరికించి పోలీసు రికార్డులు తారుమారు చేశారని కూడా తెలిపారు. 13వ తేదీన ఘటన జరిగితే 23వ తేదీన కేసు నమోదు చేసి 22న కోట్లు తప్పుదారి పట్టించారు అంటూ కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: