చంద్ర‌బాబు ఈ సారి దెబ్బేయ‌రు క‌దా... ప‌వ‌నే ఇందుకు సాక్ష్యం..!

RAMAKRISHNA S.S.
ఏపీలో టీడీపీ నేతృత్వంలోని బీజేపీ - జ‌న‌సేన కూట‌మి విష‌యంలో కొన్ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఢిల్లీ వ‌ర్గాల‌నుంచి గ‌ల్లీ వ‌ర్గాల వ‌ర‌కు కూడా.. కూట‌మి విష‌యంలో సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే.. జాతీయ‌స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వం లోని ఇండియా కూట‌మి.. చంద్ర‌బాబును క‌లుపుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. నేరుగా ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా చంద్ర‌బాబు త‌మ పాత మిత్రుడేన‌ని.. త్వ‌ర‌లోనే ఆయ‌న‌ను క‌లుస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, మ‌హారాష్ట్ర కు చెందిన మాజీ సీఎం శ‌ర‌ద్ ప‌వార్ కూడా.. చంద్ర‌బాబు త‌మ వాడేన‌ని చెప్పారు.

దీంతో ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుని, సీట్లు కూడా త్యాగం చేసి.. భారీ విజ‌యం న‌మోదు చేసిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు రాష్ట్ర అవ‌స‌రాల కోసం.. అంటే ప్ర‌త్యేక హోదా, పోల‌వరం వంటి కోసం.. ఇండియా కూట‌మితో చేతులు క‌లుపుతారా? అనేది చ‌ర్చ‌. ఎందుకంటే.. బీజేపీ ఎలానూ హోదా ఇచ్చే ప‌రిస్థితి లేదు. పోల‌వరానికి మాత్రం సాయం చేయొచ్చు. కానీ, హోదా వ‌స్తే.. చంద్ర‌బాబు  కీర్తి అనూహ్యంగా పెరుగుతుంది. పైగా.. ఆయ‌న హోదా సాధించిన నాయ‌కుడిగా ఓ నాలుగు ద‌శాబ్దాల పాటు నిల‌బ‌డిపోతారు. ఈ క్ర‌మంలోనే సందేహాలు ముసురుకున్నాయి. గ‌తంలోనూ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు క‌లిపిన నేప‌థ్యంలో ఎలానూ ఉంది.

దీంతో ఇప్పుడు కూడా.. చంద్ర‌బాబు ఎన్డీయేను కాద‌ని.. ఇండియాతో చేతులు క‌లిపితే త‌ప్పులేద‌న్న వారు క‌నిపిస్తున్నారు. అయితే.. ఇది సాధ్య‌మేనా?  ప్ర‌స్తుతం ఉన్న ఎన్డీయే కూట‌మిని ఆయ‌న క‌లుపుకొని పోతారా?  అనేది సందేహం. కానీ, ప‌రిశీల కుల అంచ‌నా వేరేగా ఉంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ చంద్ర‌బాబు అలా చేయ‌ర‌ని అంటున్నారు. ఎందుకంటే.. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు ఆదుకున్న‌ది నిస్సందేహంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆయ‌న బీజేపీని వీడి కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్టే ప‌రిస్థితి లేదు. పైగా.. చంద్ర‌బాబు కూడా.. బీజేపీ సాయంతోనే ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు.

గ‌తంలో ఆ పార్టీని వ‌దులుకునే ఆయ‌న 2019లో ప‌రాజ‌యం పాల‌య్యారు. కాబ‌ట్టి.. ఇప్పుడు కుద‌ర‌క‌కుద‌ర‌క కుదిరిన ఈ బంధాన్ని వ‌దులుకుంటే.. రేపు మ‌రోసారి ఆయ‌న‌కు చాన్స్ ద‌క్కే అవ‌కాశం లేదు. పైగా.. చంద్ర‌బాబు ఇమేజ్‌, ఆయ‌న విజ‌న్‌పై నా ప్ర‌భావం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ చంద్ర‌బాబు అలాంటి ప‌నులు చేయ‌ర‌ని.. విశ్లేష‌కులు చెబుతున్నా రు. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు అనుకూల మీడియాల్లోనూ ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. సో.. ఎలా చూసుకున్నా .. కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో ఆదుకున్న బీజేపీని చంద్ర‌బాబు వ‌దులుకునే ప‌రిస్థితి లేద‌ని.. ఈ కూట‌మి (బీజేపీ+టీడీపీ+జ‌న‌సేన‌) శాశ్వ‌త‌మ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: