అప్పుడు జగన్, ఇప్పుడు బాబు.. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేస్తున్నారా?

praveen
సాధారణంగా ఎన్నికల్లో పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఆయా పార్టీల కార్యకర్తలు కాస్త అతిగా ప్రవర్తించడం కారణంగా చివరికి ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ ఆంధ్రాలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఒక పార్టీ గెలిచిందంటే ఓడిపోయిన పార్టీకి విపత్కర పరిస్థితులు ఎదురయ్యే  దుస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ  కార్యకర్తలు, కొంతమంది నేతలు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి నేతలు, ఆఫీసులపై దాడులు చేస్తున్న తప్పు అని చెప్పాల్సిన జగన్ చూసి చూడనట్లుగానే ఉండిపోయారు అనే వాదన ఉంది.

 అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అఖండ విజయం తర్వాత అధికారాన్ని చేపట్టబోతున్న కూటమి సైతం ఇక రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా దక్కించుకోకుండా దారుణమైన ఓటుకు చవిచూసిన వైసిపి పార్టీ నేతలపై ఇక టిడిపి శ్రేణులు  దాడులు చేస్తున్న చూసి చూడనట్లుగానే ఉండబోతున్నారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇలా ఒకరు అధికారంలో ఉన్నప్పుడు మరొకరిని నామరూపాల్లేకుండా చేయాలని శాశ్వత వివాదాలను సృష్టించడం చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 ఇలాంటి చర్యలు కారణంగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం కాస్త రావణ కాష్టంగా  మారి పోయే అవకాశం ఉందని.. ఒకప్పటి రాయలసీమ ఫ్యాక్షనిజాలు, బెజవాడా రౌడీయిజాలు మళ్లీ తెరమీదకి వచ్చే అవకాశం ఉందని ఇది రాష్ట్ర శాంతిభద్రతలకు ఏమాత్రం మంచిది కాదు అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అయినా శాశ్వత వివాదాలను సృష్టించడం మానేసి ఇక పార్టీ కార్యకర్తలు, నేతలను కంట్రోల్లో పెట్టుకుని పాలనను సాగిస్తే రానున్న రోజుల్లో అయినా రాష్ట్రంలో పరిస్థితి మారుతుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: