ఇప్పుడు ఎమ్మెల్యే భవిష్యత్తులో సీఎం.. నారా లోకేశ్ కూడా ఆ ఘనత సాధిస్తారా?

Reddy P Rajasekhar
ఏపీలో 2024 ఎన్నికల్లో ఓటర్లను ఎక్కువగా ఆకర్షించిన నియోజకవర్గాలలో మంగళగిరి ఒకటి. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే చర్చతో పాటు మెజార్టీ మీద బెట్టింగ్స్ కూడా నడిచాయి. అయితే లోకేశ్ మాత్రం భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి లావణ్యపై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఈ ఎన్నికల్లో గెలిచిన నారా లోకేశ్ భవిష్యత్తులో సీఎం కూడా అవుతారని ఓటర్లు భావిస్తుండటం గమనార్హం.
 
తండ్రీ కొడుకు సీఎం కావడం వైఎస్సార్, వైఎస్ జగన్ విషయంలో జరగగా నారా లోకేశ్ కూడా ఆ ఘనత సాధిస్తారా అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. చంద్రబాబు నాలుగోసారి సీఎం పదవిని చేపట్టగా మరింత కష్టపడితే నారా లోకేశ్ ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదగడం ఖాయమని చెప్పవచ్చు. నారా లోకేశ్ ఏపీ ఎన్నికల ప్రచారానికి మాత్రం కొంతమేర దూరంగా ఉంటూనే వచ్చారు.
 
నారా లోకేశ్ ఎమ్మెల్యే కావడం వల్ల మంగళగిరి శరవేగంగా అభివృద్ధి చెందుతుందేమో చూడాల్సి ఉంది. గత ఐదేళ్లలో మంగళగిరిలో ఆశించిన రేంజ్ లో అభివృద్ధి జరగలేదని చాలామంది భావిస్తారు. అందువల్లే ఈ ఎన్నికల్లో నారా లోకేశ్ తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. లోకేశ్ కు మంత్రి పదవి రావడం కూడా కష్టం కాదనే సంగతి తెలిసిందే. గతంలోనే నారా లోకేశ్ మంత్రిగా పని చేయడం జరిగింది.
 
అల్లుడు ఎమ్మెల్యేగా గెలవడంతో బాలయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సమాచారం అందుతోంది. బాలయ్యకు కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల మంత్రి పదవి దక్కుతుందేమో చూడాలి. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి బాలయ్య సత్తా చాటిన సంగతి తెలిసిందే. నారా, నందమూరి కుటుంబాలకు ఈ ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో అనుకూలంగా రావడం గమనార్హం. నారా లోకేశ్ రాజకీయ ప్రస్థానం ఇప్పుడే మొదలైందని ఏపీ ఓటర్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: