పవన్: తిక్క కాదు పొలిటికల్ లెక్క..!

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఒక్కొక్కసారి సినిమాలలో ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు తిక్క ఉందని అయితే ఆ తిక్కకు ఒక లెక్క ఉందని తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల పైన నిరూపించబడ్డాయి. అలాగే ఓటమికి కృంగిపోరాదని విజయం కోసం ఎక్కడి వరకుైనా పోరాడాలని పవన్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తికి రాజకీయాలు ఎందుకు అంటూ చాలామంది ఎద్దేవ చేశారు. ఆయన పార్టీ పెట్టి ఇప్పటికి 10 ఏళ్లు  అయినా ఎమ్మెల్యే కాలేదని చాలామంది ప్రత్యర్థులు కూడా విమర్శించారు.

పవన్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటే చాలామంది తెలియజేశారు. ఆయన వ్యక్తిగత విషయం పైన కూడా దారుణంగా మాట్లాడారు.పవన్ మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు సత్తా లేకపోవడంతో ఆయన రాజకీయాలకే పనికిరారని కూడా ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ఎక్కడా తగ్గకుండా చాలా ఓపికగా ఉన్నారు పవన్ కళ్యాణ్ తన గెలుపు కోసం తనదైన రీతిలో కష్టపడి టిడిపి బిజెపి పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలను తీసుకోగా వాటన్నిటిని గెలిపించుకున్నారు. అలాగే రెండు తెంపి స్థానాలను కూడా గెలిపించుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్.

2019 తర్వాత పవన్ వేసిన ప్రతి అడుగులో కూడా వ్యూహం కనిపిస్తుంది. పవన్ కి తిక్క ఉంది కానీ లెక్క లేదన్న వారే శభాష్ అనిపించేలా చేశారు. ముఖ్యంగా చంద్రబాబు 2023లో అరెస్టు అయినప్పుడు రాజమండ్రి జైలుకు వెళ్లి మరి ఆయన్ని పరామర్శించారు. దీంతో వెంటనే టీడీపీతో పొత్తును కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఆ సమయంలో కార్యకర్తలు నేతలు కూడా చాలామంది నానా హంగామా చేశారు. అలా టిడిపి కూటమికి 164 సీట్లు సాధించడంలో పవన్ కళ్యాణ్ పడిన కష్టం వ్యూహాలు చాలా గొప్పగానే ఉన్నాయని చెప్పవచ్చు. దీన్నిబట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కు తిక్క కాదు పక్కాగా పొలిటికల్ లెక్క ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: