ఏపీ పొలిటికల్ పై నటుడు బ్రహ్మాజీ ఆసక్తికరమైన ట్విట్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఇటీవలే కొలువుతీరింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో కూటమి భారీ విజయం కూడా అందుకున్నది. ఈ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అఖండ విజయాన్ని అందుకున్నారు.. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడంతో చాలామంది సిని సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ హీరోకి కంగ్రాట్యులేషన్స్ చెబుతూ పోస్టు పెడుతున్నారు.దాదాపుగా పదేళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ వీడియోలకు సంబంధించిన వాటిని షేర్ చేస్తూ ఉన్నారు.

చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ విజయం పైన ప్రశంసలు కురిపించగా.. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ సైతం పవన్ కళ్యాణ్ కు విషెస్ చెబుతూ ఒక ట్విట్టుని షేర్ చేశారు. సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రోల్ చేసిన వీడియోలకు రీ ట్వీట్ చేస్తూ.. ప్రస్తుతం తాను పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని మీరు కూడా మీ పని చేసుకుంటే మంచిది ఉత్సాహం వినోదం రెండు అయిపోయాయి.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్ లో ఉన్నది. ఇక మీరు మీ భవిష్యత్తు పైన దృష్టి పెట్టండి ఎవరు కూడా ట్రోలింగ్ చేయడంలో ఎలాంటి అర్థం లేదు అంటూ తెలిపారు.

అలాగే మన భవిష్యత్తు కోసం మనమే పనిచేద్దాం వాళ్లు తప్పు చేస్తే మళ్లీ మీరు కూడా అదే తప్పు చేయకూడదు కదా అంటూ బ్రహ్మాజీ ఒక ట్విట్టును షేర్ చేశారు. కొంతమంది బ్రహ్మాజీకి మద్దతు పలుకుతూ ఉండగా మరి కొంతమంది ఫైర్ అవుతూ ఉన్నారు. మెగా ఫ్యామిలీ కి నటుడు బ్రహ్మాజీ కుటుంబం కూడా మంచి స్నేహబంధం ఉంది ఇప్పటివరకు మెగా హీరోలు అందరితో కూడా బ్రహ్మాజీ నటించారు. సినిమాలలోనే కాకుండా బయట కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారు నటుడు బ్రహ్మాజీ. ప్రస్తుతం బ్రహ్మాజీ చేసిన ట్విట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: