సిక్కిం, ఏపీ రిజ‌ల్ట్‌లో ఈ పెద్ద షాకింగ్ ట్విస్ట్ చూశారా... సేమ్ టు సేమ్‌...!

RAMAKRISHNA S.S.
ప్ర‌జ‌లు చిత్ర‌మైన తీర్పు ఇచ్చారు. 2024లో పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌తోపాటు  మొత్తం 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌రిగా యి. పార్ల‌మెంటు ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఏ పార్టీకీ ఏక‌ప‌క్షంగా అధికారం అదించ‌లేదు. ఏదో ఒక ప్రాంతీయ పార్టీల‌పై ఆధార‌ప‌డేలా  ప్ర‌జ‌లు తీర్పు చెప్పారు. దీంతో 400 స్థానాలు అని జ‌పం చేసిన‌.. మోడీ అయినా.. త‌మ‌కే అధికారం ద‌క్కుతుంద‌ని లెక్క‌లు వేసుకున్న కాంగ్రెస్ పార్టీకి కూడా.. పూర్తిస్తాయిలో అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో కేంద్రంలో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుంది. ఇక‌, రాష్ట్రాల ప‌రిస్థితి మ‌రింత భిన్నంగా ఉంది.

ఒడిశాలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు సంచ‌ల‌నాత్మ‌క తీర్పు చెప్పారు. దాదాపు 25 ఏళ్లుగా అప్ర‌తిహ‌త విజ‌యంతో దూ సుకుపోయిన న‌వీన్ ప‌ట్నాయ‌క్ పార్టీని ప‌క్క‌న పెట్టారు. కార‌ణాలు ఏవైనా.. ప్ర‌జ‌లు ఈ సారి ఆయ‌న‌ను త‌ప్పించారు. ఈ స‌మ యంలో బీజేపీకి అవ‌కాశం ఇచ్చారు. ప‌రిశ్ర‌మ‌లు, గ‌నుల అవినీతి విష‌యాన్ని ప్ర‌జ‌లు సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన‌ట్ట‌యింది. ఇక‌, ఎక్క‌డో ఈశాన్యంలో ఉన్న సిక్కిం రాష్ట్రంలోనూ ప్ర‌జ‌లు వినూత్న తీర్పు ఇచ్చారు. ఇక్కడ అస‌లు ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా పోయింది.

సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అధికారంలోకి వ‌చ్చేందుకు 19 సీట్లు వ‌స్తే చాలు. అయితే.. ప్ర‌జ‌లు ఇక్క‌డ ఏ పార్టీకీ రెండో చాన్స్ ఇవ్వ‌కుండా.. సిక్కిం క్రాంతికారి మోర్చాకు గుండుగుత్త‌గా గుద్దేశారు. ఎంత‌గా అంటే.. 32 స్థానాల్లో మొత్తం 31 సీట్ల‌ను ఈపార్టీనే ద‌క్కించుకుంది. మ‌రొక్క సీటును మాత్రం సిక్కిం డెమొక్ర‌టిక్ ఫ్రంట్ ద‌క్కించుకుంది. దీంతో సిక్కిం చ‌రిత్ర‌లో తొలిసారి.. అసలు ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా పోయింది. చిత్రం ఏంటంటే.. సుదీర్ఘ‌కాలంలో 28 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం ప‌వ‌న్ కుమార్ చామ్లింగ్ ఈ ఎన్నిక‌ల్లో మ‌ట్టిక‌రిచారు.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో తొలిసారి ఇక్క‌డ ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా పోయింది. నిన్న‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న వైసీపీ ప్ర‌తిప‌క్షంలోకి మారినా.. 10 శాతం కోరం నిబంధ‌న మేర‌కు.. వైసీపీకి ఆ సీట్లు లేకుండా పోయాయి. అంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ద‌క్కేందుకు క‌నీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ, తాజా ఎన్నిక‌ల్లో వైసీపీకి 11 మంది మాత్ర‌మే మిగిలారు. దీంతో ఆ పార్టీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం లేకుండా పోయింది. మొత్తంగా ఈ దేశంలో ఇలాంటి తీర్పులు రావ‌డం ఇదే తొలిసారి. అటు సిక్కిం, ఇటు ఏపీల‌లో అధికార పార్టీల‌దే హ‌వా.. అడిగేవారు కూడా ఎవ‌రూ లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: