బిజెపి: అయోధ్య లో ఓడిపోవడానికి కారణాలివే..?

Divya
లోక్సభ ఎన్నికల ముంగిట జనవరి నెలలో అట్టహాసంగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టను సైతం అయోధ్య మందిర్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఇదే అంశాన్ని అస్త్రంగా ఉపయోగించుకోవాలని బిజెపి పలు ప్రయత్నాలు చేసింది. అయితే అయోధ్య రాముడు ఆలయం కొలువై ఉన్న ఉత్తర ప్రదేశ్ లో లోక్సభ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ఘోరమైన ఓటమి చవిచూశారు. అయితే అక్కడ బిజెపి పార్టీని ఎందుకు స్థానికలు తిరస్కరించారని విషయం పైన ఎన్నో రకాల కారణాలు వినిపిస్తూ ఉన్నాయి.

ముఖ్యంగా గొప్ప ఆలయం నిర్మించడం మంచిదే కానీ తమ భూములను లాక్కుంటే ఎలా అంటూ అక్కడ అయోధ్యలోని అభివృద్ధి పేరిట రహదారులు విమానాశ్రయం వంటివి ఏర్పాటు చేయడం కోసం భూసేకరణ చేయడంతో స్థానికులు సైతం తీవ్రమైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారట. అలాగే భూములు తీసుకున్నందుకు దుకాణాలు కేటాయించుకోవచ్చని ప్రభుత్వం హామీ ఇచ్చినా కూడా అవి నెరవేరలేదని స్థానికులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరొకవైపు భారీగా పెరిగిన నిత్యవసర ధరలను సైతం ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారని నిరుద్యోగం ఎక్కువగా వేధిస్తోందని అందుకే చాలామంది అయోధ్యలో బిజెపి నేతలు ఓడిపోయినట్లుగా తెలుస్తోంది.

మొత్తం 543 స్థానాలలో ఎన్డీఏ కూటమి 292 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. మెజార్టీ మార్కులు 272 కంటే కేవలం 20 సీట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నది. 2014, 19 లో రెండుసార్లు బిజెపి స్వతగా 20072 మార్కును దాటింది. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వ ఏర్పాటు కోసం చాలా భాగస్వామ్యాలతో జత కట్టింది. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉంటే కేవలం 36 స్థానాలను మాత్రమే బిజెపి అందుకుంది ఇండియా కూటమి 43 స్థానాలను అందుకుంది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ లో ఎస్పీ అభ్యర్థి అవదేష్ ప్రసాద్ .. బిజెపి నేత అయిన లాలు సింగ్ ను ఓడించారు. 500 ఏళ్ల కల అయిన రామ మందిని నిర్మించిన బిజెపి పార్టీ అక్కడ ఇంత తక్కువ సీట్లు గెలవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: