ఎప్ప‌ట‌కీ కింగ్ మేక‌రే ... త‌రాలు మారినా త‌ర‌గ‌ని క్రేజ్ బాబు సొంతం

RAMAKRISHNA S.S.
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
త‌రాలు మారినా త‌ర‌గ‌ని క్రేజ్ చంద్ర‌బాబు సొంతం.. మూడు, రెండు త‌రాల‌కు చెందిన నేత‌ల‌తో కూడా పోటీప‌డుతూ ఈ వ‌య‌స్సులోనూ దూసుకుపోవ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఇప్పుడు వైఎస్‌. జ‌గ‌న్‌తో పోరాటం చేసి గెల‌వ‌డ‌మే కాదు... ఆయ‌న తండ్రిపైనా పోరాటం చేశాడు. తండ్రితో సుధీర్ఘ‌కాలం పోరాటం... ఇటు కొడుకుతోనూ పోరాటం చేసి ప‌డినా నిల‌దొక్కుకుని లేచి నిల‌బ‌డ‌డం బాబుకే చెల్లింది. 1995లో చంద్ర‌బాబు తొలిసారి ముఖ్య‌మంత్రి అయ్యాక 1999లో జ‌గ‌న్ తండ్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ఎదుర్కొని గెలిచి చూపించారు.

ఆ త‌ర్వాత 2004, 2009 వ‌రుస‌గా రెండుసార్లు ఎదురు దెబ్బ‌లు తిన్నా కూడా 2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత వైఎస్ కొడుకు జ‌గ‌న్‌తో పోరాటం చేసి మూడో సారి ముఖ్య‌మంత్రి అయ్యారు. న‌వ్యాంధ్ర తొలిసీఎంగా రికార్డుల‌కు ఎక్కారు. క‌ట్ చేస్తే 2019 ఎన్నిక‌లు చంద్ర‌బాబు కెరీర్‌కే అగ్నిప‌రీక్ష‌గా మిగిలాయి. ఎన్డీయేకు దూర‌మ‌య్యారు. చంద్ర‌బాబు ఘోరంగా ఓడిపోయారు. కేవ‌లం 23సీట్ల‌కే పార్టీ ప‌రిమితం అయ్యింది. అస‌లు చంద్ర‌బాబు పార్టీని బ‌తికిస్తారా ? మ‌ళ్లీ తిరిగి అధికారంలోకి వ‌స్తారా ? అన్న‌ది కూడా అంతు ప‌ట్ట‌లేదు.

అలాంటి టైం నుంచి పార్టీకి జ‌వ‌స‌త్వాలు నింపి.. కేడ‌ర్‌లో స్థైర్యం నింపి అధికారంలోకి తీసుకు రావ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొని.. ఎన్నో అవ‌మానాలు దిగ‌మింగుకుని.. పార్టీని స‌క్సెస్ చేశారు. 75 + ఏళ్ల వ‌య‌స్సులోనూ ప‌త‌నం అయిపోయింద‌నుకున్న పార్టీని న‌డిపించి కనీవినీ ఎరుగ‌ని రీతిలో ఏకంగా బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని 164 సీట్ల‌తో అధికారంలోకి తీసుకు రావ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

ఇక ఈ రోజు ఎన్డీయేలో ప్ర‌ధాన‌మంత్రి గా వ‌రుస‌గా మూడోసారి ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతోన్న మోడీ సైతం ఢిల్లీలో రెడ్ కార్పెట్ వేసి మ‌రీ బాబును ఆహ్వానించారు. మ‌ళ్లీ వేజ్‌పేయ్ టైం త‌ర్వాత చంద్ర‌బాబు ఇప్పుడు కూడా ఎన్డీయేలో కీల‌కం కానున్నారు. ఎన్నో క‌ష్టాలు, అవ‌మానాల త‌ర్వాత చంద్ర‌బాబు మంచి అవ‌కాశం వ‌చ్చింది. మ‌రోసారి భార‌త రాజ‌కీయ చిత్ర ప‌టంపై చంద్ర‌బాబు శ‌కం తిరిగి మొద‌లైన విజ‌యం ఇది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: