జగన్ :మరో రెండేళ్ల పాటు టచ్ చేయలేరా..?.

Divya
జూన్ 4వ తేదీన వెలుబడిన ఆంధ్రప్రదేశ్ ఫలితాలలో వైసిపి పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది. దీంతో జగన్మోహన్ రెడ్డిని ఈసారి రాజకీయంగా ఇబ్బంది పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం 11 స్థానాలకి పరిమితమయ్యారు. లోక్సభలో నలుగురు సభ్యులు ఉండనున్నారు. అది కూడా తిరుపతి, అరకు, రాజంపేట ,కడప నుంచి మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలవడం జరిగింది. దీంతో జగన్ పైన కేసులు పెట్టి ఇబ్బంది పెడతారని అభిప్రాయం చాలా మంది నేతలలో ఉన్నది. అంతేకాకుండా కూటమిలో చంద్రబాబు చాలా కీలకంగా వ్యవహరించడంతో కేసుల పైన మోడీతో మాట్లాడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఇలాంటి సమయంలో ఒక విషయం తెర మీదకి వచ్చింది అదేమిటంటే బిజెపి పార్టీ కేవలం 240 స్థానాలకి ఇప్పుడు పరిమితమయింది. దీంతో మిత్రపక్షల అవసరం చాలా ఉన్నది..అలాగే బయట నుంచి వచ్చే పార్టీల మద్దతు కూడా అంతే అవసరం ఉన్నది. ఒడిస్సా ప్రాంతంలో నవీన్ పట్నాయక్ ను ఓడించి అక్కడ బిజెపి విజయం లభించింది. అలాగే నవీన్ పట్నాయక్ పైన ప్రచారంలో మోడీ వ్యక్తిగత విమర్శలు చేశారు. అలాగే వైసిపి రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉన్నాయి. కేవలం టిడిపికి ఒక్క స్థానం కూడా పెద్దల సభలో లేకపోవడంతో ఇక్కడ వైసిపి చాలా కీలకంగా మారబోతోంది.

దీన్నిబట్టి చూస్తే మరో రెండు సంవత్సరాలు వైసిపి పార్టీ 11 మంది రాజ్యసభలో ఉండబోతున్నారు.దీన్నిబట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వైసీపీ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదట. 2026 జూన్ నెల వరకు నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీగా ఉండబోతున్నాయి. జూన్ 21వ తేదీన వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పరిమల్ నత్వాన్ని  పదవీకాలం పూర్తి కాబోతోంది. ఆ తర్వాత వైసీపీకి చెందిన రాజ్యసభ స్థానాలు కూడా కూటమి ఖాతాలోకి వెళ్లిపోతాయి. దీన్నిబట్టి చూస్తే జగన్ పైన దూకుడు తనాన్ని ప్రదర్శించేందుకు రాజ్యసభ స్థానాలు అడ్డుపెట్టుకొని అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: