ఏపీ: ఫలితాలపై.. పూనమ్ కౌర్ రియాక్షన్..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గానే ఉంటూ పలు రకాల విషయాల పైన స్పందిస్తూ ఉంటుంది. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పైన ఎన్నో ప్రశంశాలు కురిపిస్తూ పలు రకాల పోస్ట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేది.

తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫలితాల పైన పూనమ్ రియాక్ట్ అయ్యింది. అయితే ఇది ఎవరు ఊహించని విధంగా రియాక్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. టిడిపి జనసేన బిజెపి కూటమి పై రియాక్ట్ అవుతూ పూనమ్ కౌర్ వైయస్సార్సీపీ నినాదం వై నాట్ 175 పైన సెటైరికల్ ట్విట్ వేసినట్లుగా కనిపిస్తోంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల పైన స్టోరీ లో ఇలా షేర్ చేసింది.. వై నాట్ 175 అనే విషయాన్ని ఏపీ ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది.

ప్రస్తుతం పూనమ్ కౌర్ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో ఈమె ఎవరిని ఉద్దేశించి కామెంట్లు చేసిందో అర్థం కావడం లేదంటే తలలు పట్టుకుంటున్నారు. గతంలో పలుసార్లు జగన్ ఆయన ప్రవేశపెట్టిన పథకాలను, అలాగే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి సేవలను కూడా స్మరిస్తూ పలు రకాల పోస్టులను షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఎవరికీ అంతు పట్టకుండా వైయస్సార్సీపీ వై నాట్ 175 నినాదం పైన సెటైరికల్ పోస్ట్ వేయడంతో ఈ విషయం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నది. మరి ఈ విషయం పైన ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: