సీనియర్లకు బాబు భారీ షాక్.. కేబినేట్ లో వీళ్లకు మాత్రమే ఛాన్స్ దక్కనుందా?

Reddy P Rajasekhar
ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని చాలామంది ఊహించగా ఆ ఊహే ఎట్టకేలకు నిజమైంది. వైసీపీ వ్యతిరేక ఓట చీలనివ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నంలో సఫలమయ్యారు. ఏపీలో ఏకంగా 164 స్థానాల్లో విజయంతో కూటమి ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రంలో పోటా పోటీ పరిస్థితి ఉంటుందని చాలా సర్వేలు వెల్లడించినా పరిస్థితి మాత్రం మరో విధంగా ఉండటం కొసమెరుపు.
 
ఈ నెల 9వ తేదీన ఉదయం 11.53 గంటలకు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవడంతో మంత్రి పదవి విషయంలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అయితే చంద్రబాబు మాత్రం ప్రతిభ ఉన్నవాళ్లకు, పదవికి న్యాయం చేసేవాళ్లకు మాత్రమే కేబినేట్ లో చోటు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.
 
చంద్రబాబు ఈ సూత్రాన్ని ఫాలో అయితే చాలామంది సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కష్టమే అనే కామెంట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. మరో 40 సంవత్సరాల పాటు రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారని వైసీపీ చేసిన తప్పులు తమ పాలనలో జరగకుండా జాగ్రత్త పడుతున్నారని భోగట్టా. బొబ్బిలి నుంచి గెలిచిన బేబి నాయన, శ్రీకాకుళంలో గౌతు శిరీష, ఆముదాల వలసలో కూన రవికుమార్ కు ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
 
పాయకరావుపేటలో గెలిచిన వంగలపూడి అనితకు సైతం మంత్రి పదవి పక్కా అని ప్రచారం జరుగుతోంది. గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాసరావుకు సైతం మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్నడూ మంత్రి పదవి చేయని వాళ్లే ఈసారి కేబినేట్ లో మంత్రి పదవిని సొంతం చేసుకోనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే కొత్తవాళ్లకు, పెద్దగా అనుభవం లేని ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తే సీనియర్ల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. కూటమికి కేబినేట్ సీట్ల కేటాయింపులు కొన్ని ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: