ఏపీ: అంధకారంలోకి వైసిపి నేత భవిష్యత్తు.. అరెస్టు తప్పదా..?

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల జరుగుతున్న సమయంలో హాట్ టాపిక్ గా మారిన వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు ఒక్కసారిగా మారు మోగింది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతమంతా కూడా బందోబస్తుతో  ఫలితాల సమయంలో కూడా ఉన్నది. అయితే కోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడు తెలుస్తోంది. ఈయన అరెస్ట్ కు సైతం రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వైసీపీ నేతపైన అనేక కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మొన్న జరిగిన ఎన్నికలలో పాల్వాయి గేటు వద్ద జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులతో పాటు మూడు హత్యయత్నం కేసులో కూడా ఈయన పైన నమోదైనట్లుగా సమాచారం. పిన్నెల్లి నరసరావుపేట మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉండడంతో పెద్ద సంఖ్యలో కూడా పోలీసులు మోహరించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరొకసారి తప్పించుకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు నిగా పెట్టినట్లుగా తెలుస్తోంది. మరొకవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టుకు వెళ్లి ముందస్తు బయలు కూడా తీసుకురావడం జరిగింది.

దీంతో గురువారం వరకు ఆయన్ని అరెస్టు చేయకూడదు అంటూ కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా తెలియజేసింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళవద్దు అంటూ ఆదేశాలు ఇచ్చింది దీంతో ఆయన నివాసంలో ఉన్న ప్రాంతంలోని పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఉన్నారు.. పల్నాడు ప్రాంతమంతా హై అలర్టుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది వ్యాపార దుకాణాలను కూడా మూయించేశారు. దీంతో పిన్నెల్లి ఇవాళ ఏ క్షణమైన కూడా అరెస్టు చేసే విధంగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కూటమి కూడా అధికారంలోకి రావడంతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉన్నది. దీన్ని బట్టి చూస్తే ఈయన ఫీచర్ ఏంటి అనే విషయం ఇప్పుడు ఉత్కంఠంగా మారుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: