ఇలా జరిగితే.. బాబుతో పాటు పవన్ కూడా సీఎం అవుతాడా?

praveen
ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సంచలన తీర్పును ఇచ్చారు. అధికారంలో ఉన్న వైసిపి పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూటమిని గెలిపించారు. ఒకరకంగా భారీ గెలుపుతో కూటమి ప్రభంజనం సృష్టించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్న నేపథ్యంలో.. ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. అయితే కూటమి విజయం కోసం తనను తాను తగ్గించుకొని సీట్లలో కూడా తక్కువ తీసుకొని 100% విజయాన్ని అందుకున్నారు పవన్ కళ్యాణ్.

 21కి 21 సీట్లలో విజయం సాధించి ఇక రెండవ లార్జెస్ట్ పార్టీగా ఏపీలో ఎదిగారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు మాత్రమే కాదు ఏపీలో పవన్ కళ్యాణ్ కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి  కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సీటు షేర్ చేసుకున్నట్లు.. ఏపీలో కూడా పంచుకునే అవకాశాలు లేకపోలేదు అంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకలో సిద్ధరామయ్యకు తొలి రెండేళ్లు మరో మూడేళ్లు డీకే శివకుమార్ కు సీఎం పదవిని ఇస్తున్నట్లు గతంలో ప్రకటించింది.

 ఇలా ఇద్దరు కీలక నేతల మధ్య అసంతృప్తి ఉండకుండా.. సీఎం సీటును షేరింగ్ చేసుకున్నారు. అయితే కర్ణాటకలో జరిగినట్లుగానే ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ కి రెండేళ్ల పాటు సీఎం సీటు ఇస్తారా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చించుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై అటు జనసేన అభిమానులందరూ కూడా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి అభిమానులందరూ కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం చూశాం. కాపు సామాజిక వర్గంలో ఉన్న ముఖ్య నేతలు కూడా పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుండు అని కోరుకుంటున్నారట. వీరితోపాటు జన సైనికులు  కూడా పవన్ కి సీఎం సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో ఏం జరగబోతుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: