మెజారిటీ వచ్చినా.. ఇది రేవంత్ కి ఎదురు దెబ్బే?

praveen
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకు మించిన మెజారిటీని సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేసింది. కానీ ప్రజలు మాత్రం మరోల తీర్పునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయితే అటు కెసిఆర్ కు షాక్ ఇచ్చి అధికారం కాంగ్రెస్కి కట్టబెట్టారో.. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇలాగే ఇచ్చారు తెలంగాణ ప్రజలు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి కాకుండా.. అప్పుడప్పుడే తెలంగాణ రాజకీయాలపై పట్టు సాధిస్తున్న బిజెపిని మరింత బలంగా నమ్మారు.

 ఈ క్రమంలోనే కాంగ్రెస్ తో పాటుగానే బిజెపికి కూడా మంచి లీడింగ్ ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ లీడింగ్ తో అటు కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా షాక్ తగిలింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చాం. ఇక మాకు తిరుగులేదు అని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు చెబుతూ ఉంటారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆ పార్టీని ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మలేదు అన్న విషయాన్ని తమ ఓటింగ్ ద్వారా తేల్చేశారు. అయితే అటు బిజెపి 8 సీట్లలో విజయం సాధిస్తే కాంగ్రెస్ కూడా 8 సీట్లలో గెలిచింది. ఇలా మిగతా పార్టీలతో పోల్చి చూస్తే మెజారిటీలో తక్కువ లేకపోయినప్పటికీ.. కాంగ్రెస్ కి మాత్రం ఇది భారీ ఎదురుదెబ్బ అని ఎంతో మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ఒకరకంగా చెప్పాలంటే అధికారంలోకి వచ్చిన కేవలం ఆరు నెలల కాలంలోనే కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీచాయి అన్నది అర్థమవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి మంచి మెజారిటీ సాధించి హస్తం పార్టీకి రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సవాల్ విసిరింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా  మహబూబ్నగర్లో కాషాయ జెండా రెపరెపలాడటం సంచలనంగా మారిపోయింది. అక్కడి నుంచి డీకే అరుణ విజయం సాధించారు అన్న విషయం తెలిసిందే. అయితే 2019లో రేవంత్ ఎంపీగా గెలిచిన మల్కాజిగిరిలో.. సిట్టింగ్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కాపాడుకోలేకపోయింది. అక్కడ ఈటెల రాజేందర్ మూడు లక్షలకుఫై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఎక్కువమంది ఎంపీలను గెలిపిస్తే కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర రేవంత్కు మంచి క్రేజ్ పెరిగేదని.. కానీ ఇప్పుడు బీజేపీ దెబ్బతో రేవంత్ కు గట్టి షాక్ తగిలింది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: