అయ్యబాబోయ్.. దేశవ్యాప్తంగా NOTAకు ఎన్ని లక్షల ఓట్లు పడ్డాయో తెలుసా?

praveen
దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచిన పార్లమెంట్ ఎన్నికల హడావిడి ముగిసింది. ఇక అందరూ ఊహించినట్లుగానే అటు కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టేందుకు రెడీ అయింది. ఏకంగా మ్యాజిక్ ఫిగర్ ని దాటేసిన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టేసింది అన్న విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వచ్చాయి అని చెప్పాలి.

 మరోవైపు కేంద్రంలో గతంతో పోల్చి చూస్తే బిజెపి పార్టీకి మెజారిటీ తగ్గినప్పటికీ.. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన మెజారిటీ రావడంతో ఇక తిరుగులేకుండా పోయింది. అయితే ఇటీవల ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చింది ఎవరు అత్యధిక మెజారిటీతో గెలిచారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. అందరూ కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఎవరు ఎక్కువ మెజారిటీ సాధించారు అనే విషయంతో పాటు బరిలో నిలిచిన అభ్యర్థులకు ఎవరికి ఓటు వేయడం ఇష్టం లేక నోట గుర్తుని తమ ఓటుగా మార్చుకున్న ఓటర్లు ఎంతమంది అన్నది కూడా సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు.

 ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటా కి పోలైన ఓట్ల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఏకంగా నోటాకు 63 లక్షల 72,223 ఓట్లు పోలైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా బీహార్ లో 8.97 లక్షల ఓట్లు నోటా కి పడ్డాయి అన్న విషయాన్ని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇక ఆ తర్వాత యూపీలో 6.34 లక్షలు, మధ్యప్రదేశ్లో 5.32  లక్షలు, పశ్చిమ బెంగాల్లో 5.22 లక్షలు, తమిళనాడులో 4.61 లక్షలు, గుజరాత్లో 4.49 లక్షలు, మహారాష్ట్రలో 4.12 లక్షలు ఏపీలో 3.98 లక్షలు, ఒడిశాలో 3.24 లక్షల మంది ఓటర్లు నోట వేశారట  అయితే 2019 ఎన్నికల్లో 65.2 లక్షలు నోటా ఓట్లు పడగా.. ఈసారి రెండు లక్షలు తగ్గాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: