రాయలసీమ: పదవికి రాజీనామా చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు చాలా ఉత్కంఠంగా జరిగాయి.. ముఖ్యంగా జూన్ 4వ తేదీన ఫలితాలు కూడా వేలుపడడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అధికార పార్టీ ఘోరమైన ఓటమిని చవిచూసింది. ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి ఒక చరిత్రను సైతం సృష్టించింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాయలసీమలోని చాలా ప్రాంతాలలో కూడా అల్లర్లు చాలా స్పష్టంగా కనిపించాయి. దీంతో ఫలితాల విడుదల సమయంలో కూడా భారీ బందో బస్తునే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసిపి టిడిపి వర్గాల మధ్య భారీ ఎత్తున గొడవలు బాంబుదాడులు కూడా జరిగాయి.

ఎట్టకేలకు తాడిపత్రి నుంచి జెసి అస్మిత్ రెడ్డి మంచి విజయాన్ని అందుకున్నారు. గతంలో వైసిపి పార్టీ ఉన్న సమయంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవి కైవసం చేసుకుంది. అయితే ఈ పదవి జెసి ప్రభాకర్ రెడ్డి నెల రోజుల లోపే రాజీనామా చేస్తానంటూ కూడా ఒక సంచలన ప్రకటన వెలువడించారు. వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా 74 మున్సిపాలిటీలో వైసిపి అధికారం అందుకోగా.. తాడిపత్రి మాత్రం టిడిపి కైవసం చేసుకున్నది.

జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా పదవి బాధ్యతలను కూడా చేపట్టారు అలా మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనప్పుడు నాలుగు సంవత్సరాలలో మున్సిపల్ కౌన్సిలర్లను సైతం ఏడాదికి ఒకరు చొప్పున చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంటారు. 2024 ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి బిజెపి జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో తన మున్సిపల్ చైర్మన్ పదవికి నెల రోజుల లోపే రాజీనామా చేస్తానంటూ గతంలో ప్రకటించారు జెసి ప్రభాకర్ రెడ్డి. దీంతో అన్నట్టుగానే ఎట్టకేలకు రాజీనామా పదవిని చేసినట్లుగా తెలుస్తోంది గత ఐదు సంవత్సరాలలో తాడిపత్రిలో అభివృద్ధి జరగలేదని జరగడానికి పూర్తిస్థాయిలో చేస్తానని కూడా వెల్లడించారు. మరి ఏ మేరకు తాడిపత్రిని మరొకసారి అభివృద్ధి బాట పట్టిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: