2024పాలిటిక్స్: సినీ గ్లామర్ కలిసి వచ్చిందా..?

Divya
ఎన్నో ఏళ్ల నుంచి అటు సినీ ఇండస్ట్రీకి ఇంటికి రాజకీయాలకు మంచి అనుబంధము ఉన్నది. ఈ రెండు రంగాలలో చాలామంది సెలబ్రిటీల జాబితా పెద్దదిగానే ఉంటుంది. ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వారిలో ఎంజీఆర్ జయలలిత సీనియర్ ఎన్టీఆర్ తదితర నటులు ఉన్నారు. అయితే ఆ తర్వాత తరంలో విజయకాంత్ ,శరత్ కుమార్, కమలహాసన్, రాధిక, ఖుష్బూ వంటి వారు కూడా ఉన్నారు.. ఎన్టీఆర్ తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన చివరికి కాంగ్రెస్ లోకి విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ రాజకీయాలలోకి వెళ్లలేదు.

అయితే ఈసారి 2024 ఎన్నికలలో సినీ ప్రభావం చాలా పెద్దగానే కనిపించింది.కొంతమంది డైరెక్టర్లు , నటీనటులు ఎమ్మెల్యే ఎంపీలుగా కూడా పోటీ చేశారు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టి ప్రజలలో మంచి క్రేజీ తెచ్చుకున్న 2019లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు 2024లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. అంతేకాకుండా తన పార్టీ నుంచి నిలబెట్టిన వారందరినీ కూడా గెలిపించుకున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ఫ్యాక్టరీ విజయాన్ని అందుకున్నారు నగర్ నుంచి రోజా ఓడిపోవడం జరిగింది.

మలయాళ ఇండస్ట్రీ నుంచి సురేష్ గోపి త్రినూర్ పోటీ చేయగా గెలిచారు. అలాగే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన కంగనా రనౌత్ రాజకీయాలలోకి అడుగుపెట్టి ఫైనల్ గా హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచింది. రచన త్రిపాఠి బెంగాలీలో హుబ్లీ నుంచి తృనమాల్ కాంగ్రెస్ పోటీ చేసి గెలిచారు. అలాగే వాళ్ళు సినిమాలలో విలన్గా నటించిన రవి కిషన్ కూడా గోరక్పూర్ నుంచి గెలిచారు. యూపీలో మధుర నుంచి హేమమాలిని విజయాన్ని అందుకుంది. ఎన్నో చిత్రాలలో నటించి పేరుపొందిన హీరోయిన్ నటి రాధిక తమిళనాడులో పోటీ చేసి ఓటమి పాలయ్యింది. అలాగే తెలుగులో పలు సినిమాలో హీరోయిన్గా నటించిన నవనీత్ కవర్ కూడా మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కన్నడలో సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ భార్య గీత పోటీ చేసి ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: