నా పాలన అంటే ఏంటో చూపిస్తా.. బాబు హామీతో ఏపీ ప్రజల రాత మారినట్టేనా?

Divya
ఆంధ్రప్రదేశ్లోని 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ సింగిల్ గా పోటీ చేసి 151 సీట్లను కైవాసం చేసుకుంది. అయితే ఈసారి కూటమిగా వచ్చిన టిడిపి, బిజెపి ,జనసేన పార్టీ 163 సీట్లను గెలుచుకున్నారు. దీంతో వైసిపి పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. టిడిపి జనసేన నేతలు సైతం గెలుపుతో ఉత్సాహంతో కనిపిస్తున్నారు. నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం తనకు శత్రుత్వం కాదని కేవలం రాష్ట్ర ప్రయోజనాలు చేకూర్చే కోసమే తాను కూటమితో జతకట్టానని అన్నట్టుగానే అన్నిటిని నెరవేరుస్తానని తెలియజేశారు.

ఈ రోజున చంద్రబాబు నాయుడు మీడియా ముందు మాట్లాడుతూ గతంలో తమకు అసెంబ్లీలో మాట్లాడడానికి మైకు ఇవ్వలేదని అందుకే ఆ కౌరవసభలో ఉండడం కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ క్షేత్రస్థాయిలో వచ్చి అసెంబ్లీని గౌరవ సభ చేస్తానని ప్రతిజ్ఞ చేశానని ఆ రోజు నేను ఏదైతే చేశాను దానిని ఇప్పుడు నిజం చేశానని తెలియజేశారు. తాను గతంలో ఎన్నో ఎన్నికలలో గెలిచాను ఇప్పుడు గెలిచినా కూడా అలాంటి ఆనందమే ఉంది.. ఎగిరి గంతు వేయలేదు ఎన్నికలలో ఓడిపోయిన పొంగిపోలేదు ఓడిపోయినప్పుడు కూడా బాధ్యతగానే ప్రతిపక్షంలో ఉన్నానని తెలిపారు చంద్రబాబు.

తన గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ బాధ్యతతోనే పనిచేస్తానని అలాగే పవన్ కళ్యాణ్ తో పాటు బిజెపి అధినాయకత్వం మోదితో పాటు అమిత్ షా కూడా ఇక్కడ న్యాయకత్వం పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం అంటూ తెలియజేశారు. అలాగే తన పాలన అంటే ఏంటో చూపిస్తాను అంటూ చంద్రబాబు ఆమెతో ప్రజల తలరాత మారిపోతుందేమో అన్నట్లుగా తెలుస్తోంది. అయితే మరి కొంతమంది నేతలు మాత్రం గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అసలు నెరవేర్చలేదని.. మరి ఈసారైనా నెరవేరుస్తారా లేదా అన్నట్టుగా తెలుపుతున్నారు. ఈసారి నెరవేర్చలేకపోతే ఇక జీవితంలో మరొకసారి రాలేరని కూడా తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: