ప్రజస్వామ్యమే సిగ్గుపడేలా జగన్ పాలన.. పవన్ సైలెంట్ అయినా బాబు తగ్గలేదుగా!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు నిన్నటి రోజున ఫలితాలు వెలువడి టిడిపి పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది. అలాగే జనసేన పార్టీ కూడా 21 స్థానాలలో భారీ విజయాన్ని అందుకుంది. ఈ రోజున ప్రెస్మీట్లో చంద్రబాబు మాట్లాడుతూ ఇక పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ఎలా నెరవేరుస్తారో అనే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని పని చేస్తామని ఈ ఐదు సంవత్సరాలలో జరిగిన పని వల్ల 30 సంవత్సరాల వరకు ఎంత డామేజ్ జరగాలో అంతే డ్యామేజ్ జరిగింది అంటూ కూడా తెలియజేశారు.

జగన్ చేసిన పనుల వల్ల వ్యవస్థలు అన్నీ కూడా నాశనమయ్యాయని ఎకనామి చాలా తగ్గిపోయింది అంటూ తెలిపారు. ఎంత అప్పు  చేశారో తెలియదు రాష్ట్రం అంతట సహజ సంపద చాలా విచ్చలవిడిగా దోపిడీ జరిగింది అంటు చంద్రబాబు తెలియజేశారు.. ఈ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని మేము ఏదైనా చేస్తాము మాకు ఎవరైనా అడ్డు వస్తే తొలగించుతాము అనే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందంటూ ఎవరు ఎదురు చెప్పలేకపోయారని కూడా చంద్రబాబు ఎద్దేవా  చేశారు.

భూగర్భ జలాలు ఇసుక దోపిడీల వల్ల అడుగంటి పోయాయి.. అయితే రైతులు వైసీపీ నాయకులకు ఎదురు చెప్పే సాహసాన్ని చేయలేకపోయారు బెదిరించలేని నిస్సహాయ స్థితికి రైతులు వచ్చేసారని టిడిపి వాళ్ళు దీనిపైన ప్రశ్నిస్తే అందరిని అరెస్టు చేశారని నిర్బంధం చేశారని కూడా తెలియజేశారు.. ముఖ్యంగా అన్నిటిని సక్రమంగా పెట్టే బాధ్యత తీసుకున్న తర్వాతే అన్ని పనులు చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు తెలియజేశారు.. మరి ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసిన కూటమి రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి పనులు చేస్తారని విషయం పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి ముఖ్యంగా మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీలను నెరవేరుస్తారో లేదో కూడా చూడాలి.. ఏది ఏమైనా చంద్రబాబు ఎవరు ఊహించలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: