అప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు నేను.. ఏపీ ఫలితాలపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్ ఇదే!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏ స్థాయిలో జరిగాయో అందరికీ తెలిసిందే ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినా ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై యావత్ దేశం ఉత్కంఠ గా చూసింది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయంతో కూటమి గెలుపొందింది. ఇక కూటమి విజయంతో సంబరాలు చేసుకుంటున్నారు టిడిపి బిజెపి జనసేన శ్రేణులు ఇకపోతే తాజాగా ఏపీ ఫలితాలపై చంద్రబాబు మొదటిసారి మీడియా ముందుకు వచ్చి తన ఫస్ట్ రియాక్షన్ గురించి వెల్లడించారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెల‌ల్లో 202 సీట్లు వ‌చ్చాయి.. 1994లో ప్ర‌జా వ్య‌తిరేక‌త వ‌ల్ల ముగ్గురు సీఎంలు మార‌డం వ‌ల్ల అపొజిష‌న్ కాంగ్రెస్‌కు ప్ర‌తిప‌క్ష హోదా రాలేదు.. వాటిని మ‌రిపించేలా ఈ సారి ఊహించ‌ని ఫ‌లితం వ‌చ్చింది. దానికి కార‌ణాలు నేను చెప్ప‌ను.. అనుభ‌వించిన ప్ర‌జ‌ల‌కే తెలుస్తుంది..ప్ర‌జాస్వామ్యంలో మాట్లాడే హ‌క్కు ను కూడా కోల్పోవాల్సి వ‌చ్చింది. ఆస్తులకు కూడా ర‌క్ష‌ణ లేకుండా పోయింది.  ఎన్ని త్యాగాలు చేసి అయినా భ‌విష్య‌త్తు త‌రాల కోసం నిల‌బ‌డ‌తాం 55.35 % ఓట్లు మాకు వ‌చ్చాయి..

టీడీపీకి 45.60 శాతం,  వైసీపీకి 39.37 శాతం ఓట్లు వ‌చ్చాయి.. చార్మినార్ లో ఒక‌ప్పుడు వ‌చ్చే మెజార్టీ ఇప్పుడు ఏకంగా 95 వేల ఓట్లు వచ్చాయి. ఆ త‌ర్వాత రెండో స్థానానికి కుప్పం, సిద్ధ‌పేట పోటీప‌డేవి.. ఈ సారి 95, 94 వేల మెజార్టీ ఓట్లు వ‌చ్చాయి. మంగ‌ళ‌గిరిలో 91 వేల మెజార్టీ వచ్చింది.. ఈ విజ‌యం ఎలా అభివ‌ర్ణించాలో నాకు తెలియ‌డం లేదు. ఒకప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు కి ఈ రేంజ్ లో ఫలితాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఉన్న సమక్షంలో ఏ రేంజ్ లో ఓట్లు రావడం నిజంగా అభివర్ణించలేనిది అంటూ తెలిపారు చంద్రబాబు..  ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: