పవన్: నమ్మింది 100% పనిచేసింది..!

Divya
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో చాలా కీలకమైన వ్యక్తిగా మారిపోయారు. పోటీ చేసిన అన్ని స్థానాలలో భారీ విజయాన్ని కూడా అందుకున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలో అంటే 21 స్థానాలలో గాను 21 గెలిచి విజయాన్ని చూపించారు. అలాగే 2 ఎంపీ సీట్లకు గాను రెండు గెలవడం జరిగింది. లోతుగా పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే పావులు కదిపినట్లుగా ఇప్పుడు అనిపిస్తోంది. ఈ ఎన్నికలు ఎదుర్కోవడానికి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి తన పార్టీ తరఫున విజయకేతం ఎగరవేయడానికి ఆయన ఎంచుకున్న మార్గం 100% కరెక్ట్ అయ్యిందని వాదనలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ నమ్ముకున్నది ఏంటనే విషయానికి వస్తే కాపు బలిజ కులం ఓట్లు పవన్ కళ్యాణ్ 2019 పరాభవాన్ని చాలా స్పష్టంగా చూపించాయి. అందుకే ఈసారి ఆయన కాపు వర్గాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ముందు జాగ్రత్తగా ఎన్నో సర్వేలు చేయించుకొని కాపు మనోగతం తెలుసుకున్న తర్వాతే నియోజకవర్గం కాపు సంఖ్య బలాన్ని కూడా పెంచుకున్నారు. అలా చాలా స్పష్టతతో కాపు కులం ఓట్లు ఎక్కడైతే మెజారిటీ ఉన్నాయి అలాంటి నియోజకవర్గం సెలెక్ట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్.

తెలుగుదేశం సిట్టింగ్ స్థానాలు కాదా.. అనేటువంటి ఈక్వేషన్ తో సంబంధం లేకుండా ఆ సీట్లన్నీ కూడా తనకు కావాలని పట్టుబడి మరి 21 అసెంబ్లీ స్థానాలను తీసుకున్నారు.ఇక్కడ సహజంగానే కాపు ఓటు బ్యాంకు చాలా ఐక్యంగా పనిచేసిందని చెప్పవచ్చు. చాలా చోట్ల వైసిపి కూడా కాపు వర్గం వారిని పెట్టుకున్నప్పటికీ జనం ఎందుకో వారికి మక్కువ చూపలేదు.. కాపు అంటే పవన్ మాత్రమే అన్నట్లుగా ఓటు వేసినట్లుగా కనిపిస్తోంది. కాపు కులం ఓటు బ్యాంకుకు ఆయా నియోజకవర్గాలలో తెలుగుదేశానికి ఉండే కొద్ది ఓట్ల బ్యాంకు కూడా పవన్ కళ్యాణ్ జత కట్టడంతో అపురూపమైన విజయం అందుకుంది. ఎప్పుడు కులాల గురించి అధికార లెక్కలు చెప్పే పవన్ కళ్యాణ్ ఈసారి కేవలం తన కులాన్ని నమ్ముకుని మాత్రమే కులం ఓట్లు వేయించుకొని ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: