బాబంటే బాబే! సవాల్ చేసి మరి గెలిచాడుగా?

Purushottham Vinay
•సవాల్ చేసి మరి 4వ సారి ముఖ్యమంత్రయిన బాబు


•అవమానించిన ప్రతిపక్షాన్ని వణికించిన బాబు


వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును ఆ పార్టీ నాయకులు చాలా ఘోరంగా అవమానించారు. ఆ అవమానానికి సహనం కోల్పోయిన చంద్రబాబు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. 2021లో జరిగిన శాసనసభ సమావేశంలో చంద్రబాబు బాబు జగన్ కి గట్టి శపధం చేశారు.తనను ఇంత ఘోరంగా అవమానించిన సభను కౌరవ సభగా అభివర్ణించి మళ్లీ తాను సీఎం గానే సభలోకి వస్తాను అని శపధం చేశారు.ఆ తరువాత బాబు రెండున్నర సంవత్సరాల పాటు అసెంబ్లీ గేట్ కూడా చూడలేదు. ఇక ఇప్పుడు బాబు సీఎం గానే సభలోకి రాబోతున్నారు అన్నది నిన్న కౌంటింగ్ తరువాత చూస్తే అర్ధం అయ్యింది. అది కూడా ఆషా మాషి గెలుపు కాదు. వైసీపీని వణికించే గెలుపు. ఈ గెలుపుని చంద్రబాబు కూడా ఊహించని ఉండరు. ఈ విధంగా కనీ వినీ ఎరుగని తీరులో ఏపీలో అధ్బుతమైన విజయాన్ని టీడీపీకి చంద్రబాబుకి ప్రజలు ఇచ్చారు. ఇలా శపధం చేసి అసెంబ్లీలో తిరిగి అడుగు పెట్టిన వారిలో మొదట అన్నగారు కీర్తి శేషులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు ఉంటే ఆ తరువాత మన రాజన్న దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. 


ఇపుడు ఆ శపధం నెరవేర్చుకుని చంద్రబాబు నాయుడు వాళ్ళ లిస్ట్ లోకి చేరిపోయారు.బాబు ఏకంగా ఏడున్నర పదుల వయసులో ఏపీకి నాలుగవ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రికార్డు కూడా ఎవరికీ లేదు.చంద్రబాబు గత అయిదేళ్ళుగా చాలా కష్టపడ్డారు. 70 ఏళ్ల పై వయసులో కూడా అవిశ్రాంతంగా కష్టపడి పోరాటం చేశారు.2019 ఘోర ఓటమి నుంచి వెంటనే తేరుకుని జనంలోకి వెళ్ళాడు. ఇంకా అంతే కాదు ఎవరూ తిరగనన్ని సార్లు పర్యటనలు కూడా చేశారు. లేటు వయసులో బాబు జనంలో తిరగడం, కష్టపడడం వంటి వాటికి ఇప్పుడు తగిన ఫలితం వచ్చింది.ఈసారి జనాలు బాబుని బలంగా విశ్వసించారు. ఏపీలో అభివృద్ధి లేదని, శాంతిభద్రతలు లేవని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని చంద్రబాబు నాయుడు చేసిన ప్రచారానికి ప్రజల నుంచి అంతే స్థాయిలో ప్రతిస్పందన లభించింది. మొత్తానికి బాబు సవాల్ చేసి మరి సీఎం అయ్యి బాబంటే బాబే అని నిరూపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: