ఏపీ:వైయస్సార్ పోయి.. ఎన్టీఆర్ వచ్చే..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని నిన్నటి రోజున ఎన్నికల ఫలితాలు వెలుబడిన వెంటనే టిడిపి పార్టీ విజయకేతం కనిపించగానే చాలామంది నేతలు కార్యకర్తలు రెచ్చిపోయారు.. ముఖ్యంగా  విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం గతంలో వైయస్సార్ యూనివర్సిటీ కింద మార్చడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున అప్పుడు దుమారం కూడా వినిపించింది. నిన్నటి రోజున టిడిపి పార్టీ గెలవగానే చాలామంది నేతలు వైయస్సార్ పేరుని తొలగించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కింద మార్చినట్లుగా కనిపిస్తోంది.

2022-23 మధ్య ఎన్టీఆర్ పేరు మార్చి దివంగత సీఎం వైఎస్సార్ పేరుని జోడించడంతో రాత్రి రాత్రికి తీసుకొని ఈ నిర్ణయం వల్ల టిడిపి నేతలు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారిని కూడా వైసిపి నేతలు అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికలలో వైసిపి గోరంగా ఓడిపోవడంతో టీడీపీ గెలవడంతో ఈ విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ మరొకసారి తెరమీదకి తీసుకురావడం జరిగింది. ఒకవైపు కౌంటింగ్ ఫలితాలు సమీపిస్తున్న వేళ వైయస్సార్ పేరుని ధ్వంసం కూడా చేశారు టిడిపి నేతలు. ఈ పేరు మార్పు పైన ఎన్టీఆర్ అభిమానులు విద్యార్థులు ఎంతో ఆగ్రహాన్ని తెలియజేశారు.

ఎన్టీఆర్ పేరు తిరిగి ఈ విశ్వవిద్యాలయానికి పెట్టాలని డిమాండ్ కూడా తీసుకోవచ్చారు. వైయస్సార్ స్టీల్ పేర్లు తీసేయడమే కాకుండా సిమెంట్ కట్టడానికి కూడా టిడిపి నేతలు తొలగించారు. ఏది ఏమైనా వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత టిడిపి నేతలు ఇలా మరొకసారి రెచ్చిపోయి వైయస్సార్ పేరు పోయి ఎన్టీఆర్ పేరు వచ్చేలా చేశారు. అందుకు సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. మరి రాబోయే రోజుల్లో మరి ఇంకా ఎలాంటి పరిస్థితులు చూడవలసి వస్తుందో అంటూ పలువురు నేతలు తెలియజేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సైతం టిడిపి నేతలు సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: