బాబును గెలిపించిన రెండు అస్త్రాలు ఇవే.. ఈ రెండు అస్త్రాలతో లెక్క మార్చేశారుగా!
ఐదేళ్లు సీఎం పదవికి దూరంగా ఉన్న చంద్రబాబు గత ఐదేళ్లలో ఎన్నో కష్టాలను అనుభవించారు. 2019 ఎన్నికల్లో ఓటమికి కారణాలను తెలుసుకున్న చంద్రబాబు గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను ఈ ఎన్నికల్లో రిపీట్ కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు. అందరినీ కలుపుకొని వెళ్లాలనే వ్యూహంతో ముందడుగులు వేయడంతో పాటు సరైన అవకాశాల కోసం సహనంతో ఎదురు చూస్తూ వచ్చారు.
జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఏపీ ఫలితాలు వార్ వన్ సైడ్ అయ్యేలా చేయడంలో బాబు సఫలమయ్యారు. వాస్తవానికి కూటమికి వైసీపీకి పోల్ అయిన ఓట్ల మధ్య వ్యత్యాసం కేవలం 20 లక్షలు మాత్రమే కావడం గమనార్హం. టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేసి ఉంటే మాత్రం ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో ఫలితం మరో విధంగా ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అదరహో అనిపించే మేనిఫెస్టో సైతం కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. జగన్ పాలనలో ఏపీలో అభివృద్ధి జరగలేదని ప్రూవ్ చేయడంలో కూటమి నేతలు సక్సెస్ అయ్యారు. జగన్ చేసిన చిన్నచిన్న తప్పులు సైతం వైసీపీ ఘోర పరాజయానికి కారణమయ్యాయని చెప్పవచ్చు. చంద్రబాబు తన వ్యూహాలతో మరోమారు రాజకీయ చాణిక్యుడు అని అనిపించుకున్నారు. మరో ఐదేళ్లు ఏపీలో కూటమికి తిరుగులేదని ఫలితాలతో ప్రూవ్ చేశారు. ఏపీలో కూటమి సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందని ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడం సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.