చంద్ర బాబు: గెలవడానికి ఉపయోగపడిన బ్రహ్మాస్త్రాలు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల యుద్ధం మరొకసారి హోరా హోరీగా మారింది కానీ .. అయితే ఫలితాలు రోజు మాత్రం వారు వన్ సైడ్ గా మారిపోయింది. కూటమి గాలికి వైసిపి ఒక్కసారిగా కుదేలు అయింది. టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా చంద్రబాబు ముందుండి నడిపించడంతో ఈసారి విజయం ఖాయం అయ్యింది. ముఖ్యంగా వైసిపి వ్యూహాలకు సైతం ప్రతి వ్యూహాలు  పన్నడంలో ఈ మూడు పార్టీలు ఒకేసారి పైన రావడం కూటానికి విక్టరీని అందించాయి. టిడిపి విజయంలో చంద్రబాబు తన 4 ఏళ్ల రాజకీయ ఎక్స్పీరియన్స్ని సైతం ప్రదర్శించారు.

ఎన్నికల ప్రచారంలో వైసీపీ పైన చంద్రబాబు చేసినటువంటి బ్రహ్మాస్త్రాల విషయానికి వస్తే వైసిపి సంక్షేమ పథకాలకు విరుగుడుగా సూపర్ సిక్స్ హామీలను సైతం ప్రకటించారు.. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళా ఆర్థిక సహాయం ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బు ఇస్తానన్నాడం.. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటివి తెలియజేశారు. వైసీపీ నవరత్నాలను తన సంక్షేమ వజ్రాలతో ఒక్కసారిగా కుదేలు చేశారు చంద్రబాబు.

అలాగే ఎన్నికల ప్రచారం ఫిక్స్ చేరుకున్నాక ఒక్కసారిగా వైసిపి ప్రభుత్వం పైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపయోగించారు. మీ భూములను జగన్ లాక్కుంటున్నారని తాను అధికారంలోకి వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేస్తానని కూడా తెలియజేశారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అస్త్రంగా చంద్రబాబుకు పనిచేసింది. దీనిపైన జగన్ తో పాటు వైసిపి నేతలు ఎంత స్పందించినా కూడా అవి పెద్దగా ఉపయోగపడలేదని చెప్పవచ్చు. ఇదే వైసీపీ పార్టీకి భారీ డామేజ్ చేసిందని కూడా పలువురు నేతలు తెలియజేస్తున్నారు. చంద్రబాబు తన సమయాన్ని చూసి ఉపయోగించిన ఈ సూపర్ సిక్స్ హామీలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్త్రాలు వైసిపి ఓటమికి కారణాలవుతున్నాయని తెలుస్తోంది.. మరి చంద్రబాబు అన్నట్టుగానే తన మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిని అమలు చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: