జగనే కాదు.. కేసిఆర్ ఓటమికి కూడా షర్మిలే కారణమా?

praveen
ఏపీ ఎన్నికల రిజల్ట్ తర్వాత అందరూ ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న షర్మిల గురించి  చర్చించుకుంటున్నారు. జగన్ పార్టీ దారుణమైన పరాజయానికి షర్మిలే కారణం అంటూ ఎంతో మంది అనుకుంటున్నారు. అయితే షర్మిల అన్న పై పోటీ చేసి  విజయం సాధించకపోయినా.. ఇక అన్న మీద ప్రతీకారం తీర్చుకోవడంలో మాత్రం విజయం సాధించగలిగింది అన్నది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

 ఇలా షర్మిల ఎన్నికల్లో ఓడినప్పటికీ తన అనుకున్నది సాధించడంలో మాత్రం గెలిచింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసిన అధికార వైసిపి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక 25 ఎంపీ స్థానాలకు గాని కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెలిచింది. అయితే అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర చరిత్రలోనే ఇంత దారుణమైన ఓటమిని చవిచూడటం ఇదే మొదటిసారి. ఇలా జగన్ పార్టీ ఓటమికి షర్మిల కారణం అని చెప్పాలి.

  బాబాయ్ దివంగత వైసిపి నేత వివేక హత్య కేసును తెరమీదకు  తీసుకురావడం.. ఇక వివేక కూతురు సునీతను వెంటబెట్టుకొని ప్రచారం నిర్వహించడం.. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను మాత్రమే కాదు జగన్ ను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం చేస్తూ వచ్చింది షర్మిల. ఇంకోవైపు ఇక వైఎస్ బిడ్డ కావడంతో మరోవైపు నుంచి ఆమెకు సానుభూతి కూడా ఉంది. అన్నీ కలుపుకొని జగన్ ను అధికారంలో ఉన్న స్థాయి నుంచి పాతాళానికి  తొక్కేయగలంలో షర్మిల విజయం సాధించింది. అయితే కేవలం ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా కెసిఆర్ ఓటమికి షర్మిల కారణం అంటున్నారు కొంతమంది విశ్లేషకులు.

 ఎందుకంటే జగన్ తో ఉన్న విభేదాల కారణంగా తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టింది షర్మిల. వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి పాదయాత్ర చేపట్టింది  ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఇక ఉద్యోగుల తరఫున ధర్నాలు చేసి.. ఒక రకంగా కేసీఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావడానికి విజయం సాధించింది. కానీ తీర ఎన్నికల సమయానికి తాను పోటీకి  దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. షర్మిల పాదయాత్ర, ధర్నాలతో కేసీఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకొచ్చి అక్కడ బిఆర్ఎస్ ఓడిపోవడానికి పరోక్షంగా కారణమైందని.. ఇలా ఏపీలో తెలంగాణలో తాను గెలవకపోయినా అందుకున్నది మాత్రం సాధించి.. జగన్  కేసీఆర్ను గద్దె దింపడం సక్సెస్ అయిందని విశేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: