11 సీట్లున్న వైసీపీకి.. ప్రతిపక్ష హోదా దక్కేనా?

praveen
ఏపీలో అధికారం ఎవరిది అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది  ఈసారి ఎవరికీ మెజారిటీ వస్తుంది అనే ఉత్కంఠకు తెరపడింది   మరోసారి అధికారంలోకి వస్తామని వైసిపి ధీమా వ్యక్తం చేయగా.. ఏపీ ప్రజలు మాత్రం మరోలా తీర్పునిచ్చారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమికే పట్టం కట్టారు. గెలిపించడం అంటే అలాంటి ఇలాంటి గెలుపు కాదు. దాదాపుగా అధికార వైసీపీని క్లీన్ స్వీప్ చేసినంత పని చేసేసింది కూటమి. ఇలా అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణమైన ఓటమి చవిచూడటం మొదటిసారి.

 వై నాట్ 175 అంటూ ప్రచారం చేసుకున్నా ఫ్యాన్ పార్టీ.. చివరికి కూటమి సునామీ ముందు తిరగలేకపోయింది. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించగలిగింది వైసిపి పార్టీ. ఇలా 175 స్థానాలలో పోటీ చేసి 11 స్థానాలకు పరిమితం కావడంతో ఇంత దారుణమైన పరాజయాన్ని ఆ పార్టీ శ్రేణులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు అందరి ముందు ఒకటే ప్రశ్న 11 స్థానాలు మాత్రమే గెలిచిన వైసిపి కనీసం ప్రతిపక్ష హోదా అయిన దక్కించుకుంటుందా లేదా అని.

 ఇక ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వేరుపడిన తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలు లభిస్తే టిడిపికి 23 స్థానాలు దక్కాయ్. దీంతో ప్రతిపక్ష హోదా టీడీపీకి దక్కింది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం వైసిపి దారుణమైన ఓటమి చవిచూసింది. అయితే కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కనీసం 18 స్థానాల్లోనైనా విజయం సాధిస్తేనే ఇక ఏ పార్టీకైనా ఆ హోదా దక్కుతుంది. కానీ వైసీపీ కేవలం 11 కే పరిమితమైంది. అంటే ఏడు అడుగుల దూరంలో చివరికి ప్రతిపక్ష హోదాకి కూడా దూరమైపోయింది. దీంతో సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఒక సాధారణ ఎమ్మెల్యే గానే వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఎన్డీఏ కూటమిలో జనసేన మిత్రపక్షంగా లేకపోయి ఉంటే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లభించేది. 21 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన అన్ని స్థానాల్లో విజయ డంక మోగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: