జరిగిన నష్టం గురించి కాదు.. కలగబోయే కష్టం గురించే జగన్‌కు దిగులు..??

Suma Kallamadi
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. చరిత్రలో ఏ సీఎం అందించనన్ని ఆర్థిక సహాయాలను సీఎం జగన్ అందించారనడంలో సందేహం లేదు. నాడు నేడు పేరుతో జగన్ బడులా రూపురేఖలను మార్చేశారు. ప్రతీ పిల్లవాడు చదువుకునేలాగా అమ్మ వడి పథకాన్ని గొప్పగా అమలు చేశారు. రోగాలతో బాధపడే వారికి ఉచితంగా చికిత్సలు చేయించారు. వాలంటీర్ వ్యవస్థతో ఇంటింటికి అన్ని పథకాలను అందజేశారు. వాహన మిత్ర పేరిట అందరి జేబుల్లో డబ్బులు వేశారు. ప్రజలకు డబ్బులు ఇస్తే వారు బాగుపడతారని భావించి, అలాగే డైరెక్ట్‌గా ఖాతాలో మనీ జమ చేశారు.
కానీ కొన్ని విషయాల్లో జగన్ చేసిన తప్పుల వల్ల ఆయన ఈసారి కేవలం 11 సీట్లతో మాత్రమే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ జగన్ కంటే చంద్రబాబు పరి పాలనే నయం అని ఏపీ ప్రజలు అనుకోవడం నిజంగా బాధాకరం. చంద్రబాబు ఎన్నో రకాలను హామీలను అమలు చేస్తానని గతంలో చెప్పారు కానీ ఆయన వాటిలో పది పర్సెంట్ హామీలను అమలు చేసిన దాఖలాలు లేవు. చంద్రబాబు హయాంలో కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉద్యోగాలను ఇచ్చిన ఘనత జగన్ కు దక్కుతుంది. అయినా ప్రజలు ఓడించేశారు.
ఇక నిన్న సీఎం జగన్ ఈ ఫలితాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. జీవితమంతా ప్రతిపక్షంలోనే గడిపానని, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుందని అన్నారు. జరిగిన నష్టం కంటే జరగబోయే నష్టం గురించే ఎక్కువ దిగులు చెందినట్లు ఆయన మాట్లాడారని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడే వరకు జగన్ ఈ కష్టాలను, కన్నీళ్లను ఫేస్ చేయక తప్పదు. మళ్లీ జనంలో తిరుగుతూ తనపై నమ్మకాన్ని పెంచుకునేందుకు కష్టపడాల్సి ఉంటుంది. 11 నుంచి మళ్లీ అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. మూడు పార్టీలు ఏకం కావడం వల్ల వాటిని ఎదుర్కోవడం కూడా కష్టమే. అయినా ధైర్యంతో ముందడుగులు వేస్తానని జగన్ ధీమాగా తెలిపారు. చూడాలి మున్ముందు జగన్ ఎగిసిపడే కెరటం లాగా మళ్లీ అధికారంలోకి వస్తారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: