కె.కె.సర్వే: ఆంధ్రుడి నాడిని పట్టిన ఏకైక సర్వే..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నిన్నటి రోజున వెలుపడ్డాయి దీంతో వైసిపి పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. టిడిపి పార్టీ కూటమిగా 163 సీట్లను సైతం కైవసం చేసుకుంది.. అయితే చాలా సర్వేలు అటు కూటమికి వైసిపి పార్టీ గెలుస్తుందంటూ తెలియజేశారు ముఖ్యంగా ఆరా మస్తాన్ సర్వే , ఆత్మ సాక్షి సర్వే, నాగన్న, ఇండియా టుడే సర్వే వంటి వాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్ అయ్యారు.. చాలామంది 100 నుంచి 120 వరకు వైసిపి సీట్లు గెలుస్తుందంటూ ఇచ్చారు.. కానీ ఇలా గెలుస్తుందని కేవలం ఒక్క సర్వే మాత్రమే ఇచ్చింది.

కరెక్ట్ గా గెస్ చేసినటువంటి సర్వే మాత్రం కేకే సర్వే అని చెప్పవచ్చు.. కేకే సర్వే 2019 ఎన్నికలలో కూడా వైసిపి పార్టీ 150 పైగా సీట్లు సంపాదిస్తుంది అంటూ తెలియజేశారు. ఆ తర్వాత మళ్లీ అతను ఎక్కడా కనిపించలేదు.కానీ ఈసారి 2024 ఎన్నికలలో చేసినటువంటి సర్వేలో జనసేన 21కి 21 గెలుస్తుంది అంటే ఎవరు నమ్మలేదు.. అలాగే గెలిచింది. అదే సందర్భంలో వైసిపి 14 సీట్లు లోపల పడిపోతుందని చెప్పడం జరిగింది వీటిని నమ్మలేదు.. అది కూడా జరిగింది.

అయితే ఇప్పుడు అతను తన కుటుంబాన్ని పరిచయం చేస్తూ.. ఇలా తెలియజేశారు. ఈ ఎలక్షన్లో సక్సెస్ఫుల్ సర్వే అంటూ తెలియజేశారు. తను నార్మల్ కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తిని అంటూ కూడా ఈ వీడియోలో తెలియజేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది దీంతో పలువురి టిడిపి నేతలు సైతం అతని సర్వే కి ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. జూన్ 9వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా అమరావతి రాజధాని అంటూ కూడా తెలియజేస్తున్నారు. మరి ఏ  మెరకు ఆరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: