గుక్క పట్టి ఏడుస్తున్న యాక్సిస్ మై ఇండియా చైర్మన్ ?

Veldandi Saikiran
ఇండియా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో...మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే అన్ని సీట్లు వచ్చినప్పటికీ... వారు అనుకున్న అంచనా మేరకు సీట్లు రాలేదు. చాలా సర్వే సంస్థలు 350 కి పైగా ఎన్డీఏ కూటమికి సీట్లు వస్తాయని తేల్చి చెప్పాయి. ఆ సర్వే సంస్థల అంచనాలు... తలకిందులు చేస్తూ ఇండియా ఫలితాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి 292 పార్లమెంటు స్థానాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.
 400 టార్గెట్ తో బరిలోకి దిగిన మోడీ ప్రభుత్వం... తక్కువ స్థానాలు గెలుచుకొని నిరాశకు గురైంది. అయితే ఈ నేపథ్యంలో యాక్సెస్ మై ఇండియా చైర్మన్, ఎండి ప్రదీప్ గుప్తా లైవ్ లో ఏడ్చేశారు. చిన్నపిల్లడిలా బుక్క పట్టి ఏడ్చారు ప్రదీప్ గుప్తా. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు.... ఆయన అనుకున్న అంచనాలకు  వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇండియా టుడే ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ లో పాల్గొన్న ప్రదీప్ గుప్తా.... ఒకసారిగా ఎమోషనల్ అయ్యారు.
 లైవ్ షో నడుస్తుండగానే భావోద్వేగానికి గురై చేశారు యాక్సిస్ మై ఇండియా చైర్మన్, ఎండి ప్రదీప్ గుప్తా. వాస్తవానికి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని... యాక్సిస్ మై ఇండియా ప్రకటన చేసింది. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ లో బిజెపికి  భారీ స్థాయిలో సీట్లను ఇచ్చింది. ఎన్నికల్లో 361 స్థానాల నుంచి 401 సీట్లు  భారతీయ జనతా పార్టీ కూటమి గెలవబోతుందని.... యాక్సిస్ మై ఇండియా ప్రకటించింది.
 అటు ఇండియా కూటమి కేవలం 131 స్థానాల నుంచి 166 సీట్లకే పరిమితమై... దారుణంగా ఓడిపోతుందని అంచనా వేసింది యాక్సిస్ మై ఇండియా. అయితే ఈ సర్వే సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ ఫలితాలు... పూర్తిగా తారు మారయ్యాయి. అఖండ విజయం సాధించాల్సిన ఎన్డీఏ కూటమి.... మిత్రపక్షాలతో... ప్రభుత్వం ఏర్పాటు చేసే  అత్యంత దారుణ పరిస్థితి నెలకొంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో బిజెపి ప్రస్తుతం లేదు. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జెడ్ యు లాంటి కీలక పార్టీల అవసరం బిజెపికి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: