మ‌చిలీప‌ట్నం ఎంపీ: కాంగ్రెస్‌, వైసీపీ ఎంపీనే కాదు.. జ‌న‌సేన‌లోనూ హీరోనే...!

RAMAKRISHNA S.S.
కూటమి పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన రెండు పార్లమెంటు స్థానాలలో మచిలీపట్నం ఒకటి. గత ఎన్నికలలో వైసిపి నుంచి ఎంపీగా గెలిచిన వల్లభనేని బాలశౌరి ఎన్నికలకు ముందు జనసేన కండువా కప్పుకొని అనూహ్యంగా మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక వైసిపి నుంచి ఎవరిని పోటీ పెట్టాలో తెలియక జగన్ దివంగత మాజీ దేవాదాయ శాఖ మంత్రి సింహాద్రి సత్యనారాయణ తనయుడు హైదరాబాదులో డాక్టర్ గా ఉన్న సింహాద్రి చంద్రశేఖర్ కు అవకాశం ఇచ్చారు చంద్రశేఖర్ రాజకీయాలకు పూర్తిగా కొత్త. దీంతో అనుకున్న స్థాయిలో ఆయ‌న ప్ర‌చారంలోకి దూసుకు వెళ్లలేక‌పోయారు.

చంద్ర‌శేఖ‌ర్ పూర్తిగా ఎమ్మెల్యే అభ్య‌ర్థుల ప్ర‌చారం మీదే ఆథార‌ప‌డ్డారు. మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు ప‌రిధిలో మ‌చిలీప‌ట్నం - పెడ‌న - అవ‌నిగ‌డ్డ - పామ‌ర్రు ఎస్సీ - గుడివాడ - గ‌న్న‌వ‌రం - పెన‌మ‌లూరు సెగ్మెంట్లు ఉన్నాయి. వైసీపీ అత్య‌ధికంగా ఈ సెగ్మెంట్‌లోనే గుడివాడ‌, గ‌న్న‌వ‌రం సీట్లు క‌మ్మ‌ల‌కు ఇచ్చింది. టీడీపీ మాత్రం గుడివాడ‌, గ‌న్న‌వ‌రం, పెన‌మ‌లూరు సీట్లు క‌మ్మ‌ల‌కు ఇచ్చింది. వైసీపీ బంద‌రు, అవ‌నిగ‌డ్డ కాపుల‌కు, పెన‌మ‌లూరు, పెడ‌న గౌడ‌కు ఇవ్వ‌గా... టీడీపీ బంద‌రు బీసీ మ‌త్స్య‌కారుల‌కు, అవ‌నిగ‌డ్డ కాపుల‌కు, పెడ‌న గౌడ‌కు కేటాయించింది. పామ‌ర్రు ఎస్సీ సీటు.

ఇక పార్ల‌మెంటుకు పోటీ చేసిన బాల‌శౌరి, చంద్ర‌శేఖ‌ర్ ఇద్ద‌రూ కాపు వ‌ర్గానికే చెందిన వారు. ఎన్నిక‌ల హ‌డావిడి ప్రారంభం కావ‌డానికి ముందు.. ప్ర‌చారం.. పోలింగ్ స‌ర‌ళి త‌ర్వాత మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు స్థానంలో ఖ‌చ్చితంగా కూట‌మి నుంచి జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ బాలశౌరి యే గెలుస్తార‌న్న అంచ‌నాలు గ‌ట్టిగా వినిపించాయి.. ఇక ఈ పార్ల‌మెంటు ప‌రిధి లోని అవ‌నిగ‌డ్డ నుంచి కూడా జ‌న‌సేన పోటీ చేస్తుండ‌డం గాజు గ్లాసు పార్టీకి మంచి ఊతం ఇచ్చిన‌ట్ల‌య్యింది. ఈ రోజు కౌంటింగ్‌లో భారీ మెజార్టీ తో ఘ‌న విజ‌యం సాధించి మూడో సారి ఎంపీగా పార్ల‌మెంటు లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: