విజ‌య‌వాడ ఎంపీ : ఇక బెజ‌వాడ గ‌డ్డ నానిది కాదు.. చిన్ని అడ్డా... బంప‌ర్ మెజార్టీతో కొట్టాడుగా..!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ముల మధ్య అదిరిపోయే పోరుకు వేదికగా నిలిచింది విజయవాడ పార్లమెంటు స్థానం. తెలుగుదేశం పార్టీ నుంచి గత రెండు ఎన్నికలలో వరుస విజయాలు సాధించిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి కేశినేని నాని సొంత తమ్ముడు కేశినేని చిన్ని పోటీలో ఉన్నారు. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన సొంత అన్నదమ్ములు.. పోటీలో ఉండడంతో విజయవాడ పార్లమెంటు సీటుపై ఎక్కడా లేని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అందులోనూ నాని వ్యక్తిగత ఇమేజ్‌తో వరుసగా రెండుసార్లు గెలిచారు. ఆయనకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న అంచనాలు కూడా వినిపించాయి. ఇద్దరూ కమ్మ‌ సామాజిక వర్గానికి చెందిన నేతలు. విజయవాడ పార్లమెంటు పరిధిలో కమ్మ సామాజిక వర్గ రాజకీయ ఆధిపత్యం ఎక్కువ. అయితే జగన్ పార్లమెంటు పరిధిలోని తిరువూరు రిజర్వ్‌డ్ సెగ్మెంట్ వదిలేస్తే.. మిగిలిన 6 నియోజకవర్గాలలో ఒక్క విజయవాడ తూర్పులో మాత్రమే కమ్మ‌ వర్గానికి చెందిన దేవినేని అవినాష్‌కు సీటు ఇచ్చారు. టీడీపీ మైలవరం, విజయవాడ తూర్పు తో పాటు కూటమి నుంచి బీజేపి తరఫున పోటీ చేసిన సుజనా చౌదరి సైతం కమ్మ వర్గానికి చెందినవారు.

ఎన్నికల హడావుడి ప్రారంభమయ్యాక నామినేషన్ల పర్వం, ప్రచార సరళి పోలింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే దీనికి తోడు రాజధాని అమరావతి మార్పు ప్రభావం బలంగా ఉండడంతో విజయవాడ పార్లమెంటు సీటుపై నానికి అనుకూలంగా ఎంత క్రాస్ ఓటింగ్ జరిగినా టీడీపీ నుంచి పోటీ చేసిన కేసినేని చిన్ని విజయం సాధిస్తారని అంచనాలు ఎక్కువగా వినిపించాయి. తిరువూరు, విజయవాడ పశ్చిమ, నందిగామ, జగ్గయ్యపేటలో గట్టి పోటీ ఉంటుందని పైకి ప్రచారం జరిగింది. వైసీపీకి తిరువూరు, విజయవాడ పశ్చిమ లోనే ఎక్కువగా అవకాశాలు కనిపించాయి. ఈరోజు జరిగిన కౌంటింగ్ లో ఇంకా వివ‌రాలు అందే టైంకే 2 ల‌క్ష‌ల ఓట్ల‌కు కాస్త అటూ ఇటూ మెజార్టీతో విజ‌యం సాధించి... ఈ సారి త‌మ్ముడిగా పార్ల‌మెంటులోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: